ప్రధాన మెనూను తెరువు

యష్ రాజ్ చోప్రా (పంజాబీ: ਯਸ਼ ਰਾਜ ਚੋਪੜਾ; హింది: यश राज चोपड़ा) (27 సెప్టెంబరు 1932 – 21 అక్టోబరు 2012) [1] భారతీయ హిందీ  సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత.[2]  ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర (1961) ఆయన రెండో సినిమా. 

ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సోదరులు ఇద్దరూ  కలసి 1950, 60 దశకల్లో మరిన్ని సినిమాలు చేశారు. వక్త్ (1965) సినిమా హిట్ కావడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందడంతో యష్ చోప్రాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.

1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్: ఎ పోయం ఆఫ్ లవ్ (1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. అమితాబ్ బచ్చన్ కెరీర్ నిలబెట్టిన దీవార్ (1975) సినిమా, కభీ కబీ (1976), త్రిశూల్ (1978) వంటి హిట్లు అందుకున్నారు.

70వ దశకం చివరిభాగం నుండి 1989 వరకు యష్ ఎన్నో వైఫల్యాలను రుచి చూశారు. ఈ సమయంలో ఆయన నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన దూస్రా ఆద్మీ (1977), మషాల్ (1984), ఫాస్లే (1985), విజయ్ (1988) వంటి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 1989లో ఆయన తీసిన చాందినీ సినిమా మంచి మ్యూజికల్ హిట్టే కాదు, కమర్షియల్ గా విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందికొంది.

విషయ సూచిక

తొలినాళ్ళ జీవితంసవరించు

 
నయా దౌర్ సినిమా ఆడియో విడుదల సభకు హాజరైన బి.ఆర్. చోప్రా (ఎడమ వైపు), యష్ చోప్రా. కెరీర్ మొదట్లో తన అన్న అయిన బలదేవ్ రాజ్ చోప్రా (బి.ఆర్.చోప్రా) దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు యష్.[3][4]

27 సెప్టెంబరు 1932న పాకిస్థానీ పంజాబ్ లోని లాహోర్ లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మిచారు.[3][5][6] ఆయన తండ్రి బ్రిటిష్ పంజాబ్ పరిపాలన సంస్థ పిడబ్ల్యూడి డివిజన్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారు. 8మంది సంతానంలో యష్ ఆఖరివారు.[7] ప్రముఖ దర్శకుడు బి.ఆర్.చోప్రా ఆయన అన్నదమ్ముల్లో ఒకరు. యష్ జోహర్ భార్య, కరణ్ జోహర్ తల్లి అయిన హిరూ జోహర్ ఆయన అక్కాచెల్లెళ్ళలో ఒకరు.

వ్యక్తిగత జీవితంసవరించు

1970 లో ఆయన ప్రమీలా సింగ్ ను పెళ్ళి చేసుకున్నారు. ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా వీరి కుమారులు[3] ఆదిత్య కూడా సినిమా దర్శకుడు, నిర్మాతే. యష్ రాజ్ ఫిలింస్ కు వైస్ చైర్మన్, జనరల్ మేనజర్ గా వ్యవహరిస్తున్నారు. ఉదయ్ ముందు సహాయ దర్శకునిగా పనిచేసినా, 2000లో అన్న తీసిన మొహొబ్బతే సినిమాతో నటునిగా మారారు.[8] 

మరణంసవరించు

21 అక్టోబరు 2012న డెంగీ జ్వరంతో మరణించారు.

అవార్డులుసవరించు

 
అంబాసిడర్ ఆఫ్ ఇంటర్ లేకెన్ (2011) బిరుదుతో యష్ చోప్రాను సన్మానించినపుడు భార్య ప్రమీలా యష్ చోప్రాతో, యష్[9][10]
జాతీయ ఉత్తమ చిత్రం (నిర్మాత)
 • 1961, ధర్మపుత్ర సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రం 
 • 1990, చాందినీ చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్  ఎంటర్ టైన్మెంట్
 • 1994, దార్ చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్ 
 • 1996, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
 • 1998, దిల్ తో పాగల్ హై చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
 • 2005, వీర్-జారా చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
ఫిలింఫేర్ అవార్డులు
 • 1965, వక్త్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
 • 1969, ఇత్తెఫక్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం 
 • 1973, దాగ్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
 • 1975, దీవార్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
 • 1991, లమ్హే సినిమా ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం
 • 1995, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
 • 1997, దిల్ తో పాగల్ హై సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
 • 2004, వీర్-జారా సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
 • 2006, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
 • 2007, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
 • 2008, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
 • 2013, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం

అప్సర అవార్డులు

 • 2008, ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమా
 • 2008, చక్ దే ఇండియా చిత్రానికి అప్సరా ఉత్తమ చిత్రం పురస్కారం

ఐఫా (ఐఐఎఫ్ఎ అవార్డులు)

 • 2005, వీర్-జారా సినిమాకు ఐఫా ఉత్తమ దర్శకుడు పురస్కారం
 • 2005, వీర్-జారా సినిమాకు ఐఫా ఉత్తమ చిత్రం పురస్కారం
 • 2008, చక్ దే ఇండియా సినిమాకు ఉత్తమ చిత్రం పురస్కారం

సినిమాలుసవరించు

నిర్మాతగా..సవరించు

 • దాగ్:ఎ పోయెం ఆఫ్ లవ్ (1973)
 • కభీ కభీ (1976)
 • దూస్రా ఆద్మీ (1977)
 • నూరే (1979)
 • కాలా పత్తర్ (1979)
 • నఖుడా (1981)
 • సవాల్ (1982)
 • మషాల్ (1984)
 • ఫాస్లే (1985)
 • విజయ్ (1988)
 • చాందినీ (1989)
 • లమ్హే (1991)
 • ఐనా (1993)
 • యే దిల్లగి (1994)
 • దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995)
 • హమ్ కో ఇష్క్ నే మారా (టెలీ ఫిలిం) (1997)
 • దిల్ తో పాగల్ హై (1997)
 • మొహొబ్బతే (2000)
 • ముఝ్సే దోస్తీ కరోగే! (2002)
 • మేరే యార్ కీ షాదీ హై (2002)
 • సాతియా (2002)
 • హమ్ తుమ్ (2004)
 • ధూమ్ (2004)
 • వీర్-జారా (2004)
 • బంటీ ఔర్ బబ్లీ (2005)
 • సలాం నమస్తే (2005)
 • నీల్ ఎన్ నిక్కీ (2005)
 • ఫనా (2006)
 • ధూమ్ 2 (2006)
 • కాబూల్ ఎక్స్ ప్రెస్ (2006)
 • త ర రమ్ పమ్ (2007)
 • ఝూం బరాబర్ ఝూం (2007)
 • చక్ దే ఇండియా (2007)
 • లాగా చునారీ మే దాగ్ (2007)
 • ఆజా నచ్లే (2007)
 • తషాన్ (2008)
 • తోడా ప్ప్యార్ తోడా మ్యాజిక్ (2008)
 • బచ్నా ఏ హసీనో (2008)
 • రోడ్ సైడ్ రోమియో (2008)
 • రబ్ నే బనా దీ జోడీ (2008)
 • న్యూయార్క్ (2009)
 • దిల్ బోలే హడిప్పా (2009)
 • రాకెట్ సింగ్:సేల్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ (2009)
 • ప్యార్ ఇంపాజిబుల్ (2010)
 • బాండ్ బాజా బారాత్ (2010)
 • ముఝ్సే ఫ్రాండ్షిప్ కరోగే (2011)
 • మేరే బ్రదర్ కీ దుల్హన్ (2011)
 • లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ (2011)
 • ఇషాక్జాదే (2012)
 • ఏక్ థా టైగర్ (2012)
 • జబ్ తక్ హై జాన్ (2012)
 • ధూమ్ 3 (2013)

దర్శకునిగా...సవరించు

సంఖ్య చిత్రం సంవత్సరం
1 ధూల్ కా ఫూల్ 1959
2 ధర్మపుత్ర 1961
3 వక్త్ 1965
4 ఆద్మీ ఔర్ ఇన్సాన్ 1969
5 ఇట్టెఫాక్ 1969
6 దాగ్:ఎ పోయెం ఆఫ్ లవ్ 1973
7 జోషిలా 1973
8 దీవార్ 1975
9 కభీ కభీ 1976
10 త్రిశూల్ 1978
11 కాలా పత్తర్ 1979
12 సిల్సిలా 1981
13 మషాల్ 1984
14 ఫాస్లే 1985
15 విజయ్ 1988
16 చాందినీ 1989
17 లమ్హే 1991
18 పరంపరా 1992
19 దర్ర్ 1993
20 దిల్ టు పాగల్ హై 1997
21 వీర్-జారా 2004
22 జబ్ తక్ హై జాన్ 2012

Referencesసవరించు

 1. The Life and Times of Yash Chopra. India Times. URL accessed on 28 October 2012.
 2. Tejaswini Ganti (24 August 2004). Bollywood: A Guidebook to Popular Hindi Cinema. Psychology Press. pp. 101–. ISBN 978-0-415-28853-8. Retrieved 29 October 2012.
 3. 3.0 3.1 3.2 "The life and times of Yash Chopra". Pune Mirror. 22 October 2012. Retrieved 29 October 2012.
 4. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Face of romance in Bollywood: Iconic filmmaker Yash Chopra's five-decade long illustrious career అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. Rachel Dwyer (1 July 2002). Yash Chopra. British Film Institute. p. 13. ISBN 978-0-85170-874-4. Retrieved 31 October 2012.
 6. End of a Love Story India Today- November 5, 2012
 7. "Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn". India Today. 22 October 2012. Archived from the original on 25 October 2012. Retrieved 28 October 2012.
 8. name=Ganti2004
 9. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Yash Chopra honoured with the title of Ambassador of Interlaken అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 10. Yash Chopra honored with the title of 'Ambassador of Interlaken'. Bollywood Hungama. URL accessed on 29 October 2012.