బల్దేవ్ రాజ్ చోప్రా (1914 ఏప్రిల్ 22 - 2008 నవంబరు 5)[1] ప్రముఖ భారతీయ దర్శకుడు. బాలీవుడ్ పరిశ్రమ, టెలివిజన్ ధారావాహికల నిర్మాత. నయా దౌర్ (1957), సాధన (1958), కానూన్ (1961), గుమ్రా (1963), హుమ్రాజ్ (1967), ఇన్సాఫ్ కా తరాజు (1980), నికాహ్ (1982), అవమ్ (1987), వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు. 1988లో టెలివిజన్ సిరీస్ మహాభారత్ నిర్మాత.[2] అతను 1998 సంవత్సరానికి సినీరంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2001లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నాడు.

బి.ఆర్.చోప్రా
2013 భారతదేశపు స్టాంపుపై బి.ఆర్.చోప్రా
జననం
బల్దేవ్ రాజ్ చోప్రా

(1914-04-22)1914 ఏప్రిల్ 22
మరణం2008 నవంబరు 5(2008-11-05) (వయసు 94)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1944–2006
జీవిత భాగస్వామిప్రకాష్ చోప్రా
పిల్లలు3, రవి చోప్రాతో సహా
సన్మానాలుదాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (1998)
పద్మభూషణ్ పురస్కారం (2001)

అతని తమ్ముడు యష్ చోప్రా, కొడుకు రవి చోప్రా, మేనల్లుడు ఆదిత్య చోప్రా కూడా బాలీవుడ్ పరిశ్రమలో దర్శకులు. అతని మేనల్లుడు ఉదయ్ చోప్రా నటుడు, నిర్మాత కూడా.

జీవిత చరిత్ర

మార్చు

బి.ఆర్.చోప్రా 1914 ఏప్రిల్ 22న షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా (గతంలో నవాన్‌షహర్ జిల్లా)లోని రహోన్‌లో జన్మించాడు. అతని తండ్రి విలయతి రాజ్ చోప్రా. ఆ తర్వాత వారు లాహోర్‌కు మారారు. అతని తమ్ముడు యష్ చోప్రా సినిమా నిర్మాత.[3]

ఆయన లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ పూర్తిచేసాడు. అతను లాహోర్‌ కేంద్రంగా ప్రచురితమైయ్యే సినీ మాసపత్రిక సినీ హెరాల్డ్‌తో 1944లో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత ఆ పత్రికను స్వాధీనం చేసుకుని 1947 వరకు కొనసాగించాడు.

అదే సంవత్సరం ఐ. ఎస్. జోహార్ కథ అయిన చాందినీ చౌక్ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో నయీమ్ హష్మీ హీరోగా నటించగా, ఎరికా రుక్షి హీరోయిన్. అయితే సినిమా నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉండగానే, లాహోర్‌లో అల్లర్లు చెలరేగడంతో అతను, అతని కుటుంబం నగరం నుండి పారిపోవాల్సి వచ్చింది.

1947లో భారతదేశం, పాకిస్తాన్‌గా విభజించబడిన తరువాత వారు ఢిల్లీకి మకాం మార్చారు. 1948లో అతను ముంబై చేరుకుని తన మొదటి ప్రొడక్షన్ కర్వాత్ నిర్మించినప్పటికీ అది అపజయం పాలైంది. దర్శకుడిగా అతని మొదటి చిత్రం అఫ్సానా 1951లో విడుదలైంది. ఇందులో అశోక్ కుమార్ ద్విపాత్రాభినయంలో నటించాడు. ఈ చిత్రం విజయవంతమవడంతో బి.ఆర్.చోప్రా పేరు బాలీవుడ్‌లో స్థిరపడింది.

1954లో మీనా కుమారి ప్రధాన పాత్రతో గతంలో ఆగిపోయిన చాందినీ చౌక్‌ చిత్ర నిర్మాణం పూర్తిచేసాడు. 1955లో తన సొంత నిర్మాణ సంస్థ బి.ఆర్ ఫిల్మ్స్‌ని స్థాపించాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి మొదటి చిత్రం ఏక్ హి రాస్తా విడుదల అయి విజయవంతమైంది. 1957లో దిలీప్ కుమార్, వైజయంతిమాల జంటగా బి.ఆర్.చోప్రా నిర్మించిన చిత్రం నయా దౌర్ గోల్డెన్ జూబ్లీ హిట్ కొట్టింది. తరువాత విడుదలైన కానూన్, గుమ్రా, హుమ్రాజ్ అరవైలలో పెద్ద విజయాలు సాధించాయి. ఆయన 1963లో 13వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యుడు.[4] నటుడు దిలీప్ కుమార్‌తో అతని రెండవ చిత్రం 1972లో ఫ్లాప్ అయిన దస్తాన్.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా/టీవీ సీరీస్ దర్శకత్వం నిర్మాత నోట్స్
1949 కర్వాత్ అవును అవును దర్శకత్వ రంగ ప్రవేశం
1951 అఫ్సానా అవును అవును
1953 షోల్ అవును కాదు
1954 చాందినీ చౌక్ అవును కాదు
1956 ఏక్ హాయ్ రాస్తా అవును అవును బి.ఆర్ దర్శకత్వంలో తొలి సినిమా. సినిమాలు
1957 నయా దౌర్ అవును అవును
1958 సాధన అవును అవును ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1959 ధూల్ కా ఫూల్ కాదు అవును
1960 కానూన్ అవును అవును హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1961 ధర్మపుత్ర కాదు అవును హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
1963 గుమ్రా అవును అవును హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
1965 వక్త్ కాదు అవును ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1967 హమ్రాజ్ అవును అవును
1969 ఇత్తెఫాక్ కాదు అవును
1970 ఆద్మీ ఔర్ ఇన్సాన్ కాదు అవును
1972 దస్తాన్ అవును అవును
1973 ధుండ్ అవును అవును
1975 జమీర్ కాదు అవును రవి చోప్రా తొలి దర్శకత్వం
1976 ఛోటీ సి బాత్ కాదు అవును ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1977 కర్మ అవును అవును
1978 పతి పత్నీ ఔర్ వో అవును అవును
1980 బర్నింగ్ రైలు కాదు అవును
1980 ఇన్సాఫ్ కా తారాజు అవును అవును ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1981 అగ్ని పరీక్ష కాదు అవును
1982 బీటా కాదు అవును
1982 నికాహ్ అవును అవును ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
ఎంపికైంది – ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1982 తేరీ మేరీ కహానీ కాదు అవును టెలిఫిల్మ్
1983 మజ్దూర్ కాదు అవును
1983 ధరి ఆకాష్ కాదు అవును టెలిఫిల్మ్
1984 ఆజ్ కీ ఆవాజ్ కాదు అవును ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1985 గజల్ కాదు అవును
1985 తవైఫ్ అవును కాదు
1986 కిరాయదర్ కాదు అవును
1986 దహ్లీజ్ కాదు అవును
1987 అవామ్ అవును అవును
1988 మహాభారతం కాదు అవును TV సిరీస్
1991 మహాభారత కథ టీవీ సీరియల్
1991 ప్రతిజ్ఞాబాద్ కాదు అవును
1992 కల్ కీ అవాజ్ అవును అవును
1992 సౌదా అవును అవును TV సిరీస్
1993 కానూన్ అవును కాదు TV సిరీస్
2000 విష్ణు పురాణం కాదు అవును TV సిరీస్
2002–2004 రామాయణం కాదు అవును TV సిరీస్
2001–2004 ఆప్ బీటీ కాదు అవును TV సిరీస్
2002–2003 మా శక్తి అవును అవును TV సిరీస్
2003 బాగ్బన్ కాదు అవును ఎంపికైంది - ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2004 కామినీ దామిని కాదు అవును TV సిరీస్
2006–2007 విరాసత్ కాదు అవును TV సిరీస్
2006 బాబుల్ కాదు అవును
2008 భూతనాథ్ కాదు అవును

అవార్డులు

మార్చు

పౌర పురస్కారాలు

మార్చు
  • పద్మ భూషణ్: 2001[5]
  • 1960: హిందీలో ఉత్తమ చలనచిత్రం కోసం మెరిట్ సర్టిఫికేట్ - కానూన్[6]
  • 1961: హిందీలో ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్రపతి రజత పతకం – ధర్మపుత్ర (నిర్మాత)[7]
  • 1998: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు[8]
  • 1962: ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు: కానూన్
  • 2003: ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

మూలాలు

మార్చు
  1. Filmmaker B R Chopra passes away. Press Trust of India via NDTV. 5 November 2008
  2. B.R.Chopra made socially relevant films The Hindu, 6 November 2008.
  3. Taliculam, Sharmila (4 April 1997). "And miles to go..." Rediff.com. Retrieved 29 October 2018.
  4. "Berlinale: Juries". berlinale.de. Archived from the original on 29 March 2010. Retrieved 13 February 2010.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  6. "8th National Film Awards". International Film Festival of India. Archived from the original on 23 November 2016. Retrieved 7 September 2011.
  7. "9th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 December 2016. Retrieved 30 July 2012.
  8. "Rediff On The NeT: B R Chopra chosen for Dadasaheb Phalke Award". Rediff.com. 21 October 1999. Retrieved 13 April 2022.