యాంత్రిక అనువాదం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఒక భాషకు చెందిన వచనాలను లేదా ప్రసంగాన్ని మరొక భాషలోకి యంత్రం ద్వారా అనువాదం చేయటాన్ని యాంత్రిక అనువాదం అంటారు. ప్రస్తుతం వచనాల అనువాదం ప్రాథమిక స్థాయిలో నున్నను త్వరలో ఊపందుకోనున్నది, ప్రస్తుతం యంత్ర అనువాదాలు కొంత గందరగోళ పరుస్తున్నాయి. పదాల పరంగా కొన్ని భాషలను యాంత్రిక అనువాదానికి అనువుగా అనువాదకులు మార్చగలిగారు. అయితే యాంత్రిక అనువాద వాక్య నిర్మాణంలో వ్యాకరణ దోషాలు ఎదురవుతున్నాయి, వ్యాకరణ దోషాలు సరిచేసేందుకు అనేకమంది అనువాదకులు కృషి చేస్తున్నారు. గూగుల్ అనువాదం అనే కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ ద్వారా ప్రస్తుతం అనేకమంది యాంత్రిక అనువాద సేవలను పొందటమే కాక అందులోని లోపాలను స్వచ్ఛందంగా సరిదిద్దుతున్నారు.
గూగుల్ అనువాదం
మార్చు- ప్రధాన వ్యాసం గూగుల్ అనువాదం
గూగుల్ ట్రాన్స్లేట్ కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ. దీనికి హిందీతో పాటు ఇతర జూన్ 21, 2011 న లభ్యమైంది. దీనివలన ఇంగ్లీషు విషయాన్ని తెలుగులో చదువుకోవచ్చు.
గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్
మార్చు- ప్రధాన వ్యాసం గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్
గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ అనువాదానికి సహాయపడే వెబ్ ఆధారిత పరికరం. దీని ద్వారా వెబ్ పేజీలు పత్రాలు అనువాదం చేయవచ్చు. వాక్యభాగాలకు అనువాద కోశాన్ని, పదాలకు ప్రత్యేక కోశాన్ని జతచేయడం ద్వారా, కంప్యూటర్ అనువాదానికి సరిపోలినవి చూపుతూ సహాయపడుతుంది.