యాగాటి చిన్నారావు
యాగాటి చిన్నారావు రచయిత, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్‌క్లూజన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా యున్నారు.[1] ఆయన వ్రాసిన 'దళిత్స్ స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటీ పేరిట ఆంగ్లంలో వెలువడి ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ పుస్తకాన్ని తెలుగులోనికి ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర పేరుతో అనువదించినందుకు గానూ ప్రభాకర్ మందార కు 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[2][3]
జీవిత విశేషాలుసవరించు
ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని 'అరసబలగ' అనే మారుమూల పల్లెటూరు. ప్రభుత్వ ఎస్.సి. బాలుర వసతి గృహంలో ఉంటూ తెర్లాం పంచాయితీ ఎలిమెంటరీ స్కూల్, జిల్లా పరిషత్ హెస్కూల్ (1974-82)లో చదివిన తర్వాత ఎ.వి.ఎన్ కళాశాల (1985-88)లో బి.ఎ. పూర్తి చేసుకుని పై చదువుల కోసం ఢిల్లీ, జె.ఎన్.యు.లో చేరి ఎమ్.ఎ., ఎమ్.ఫిల్, పి.హెచ్.డి పూర్తి చేసారు. అనంతరం స్కాట్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ [[ఎడిన్‌బర్గ్]లో విజిటింగ్ ఫెలోగా, న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతమ్ జె.ఎన్.యు.లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిన్నారావు అనేక రచనలు చేసారు.[4]
రచనలుసవరించు
చిన్నారావు అనేక రచనలు చేశారు. వాటిలో - దళిత్ స్టడీస్ ఎ బైబ్లియోగ్రాఫికల్ హ్యాండ్‌బుక్ (2003), రైటింగ్ దళిత్ హిస్టరీ అండ్ అదర్ ఎస్సేస్ (2007) ముఖ్యమైనవి.
మూలాలుసవరించు
- ↑ "faculty profile in jnu.ac.in". Archived from the original on 2016-01-30. Retrieved 2016-02-07.
- ↑ "Prabhakar bags Sahitya Akademi prize". News. The Hindu. 27 February 2010. Retrieved 7 February 2016.
- ↑ Andrapradesh Dalitha Udyama Charithra(1900-1950) (ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర(1900-1950) )
- ↑ "ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర". Archived from the original on 2016-02-17. Retrieved 2016-02-07.