యామంటౌ పర్వతం
యమంటౌ పర్వతం యూరల్ పర్వతాల్లో భాగం. ఇది రష్యాలోని బష్కొర్తోస్తాన్ ప్రాంతంలో ఉంది. దక్షిణ యూరల్ పర్వతాల్లో ఇదే ఎత్తైన పర్వతం. 1,640 మీటర్ల (5,381 అడుగుల) ఎత్తు ఉంటుంది.ఈ పర్వతంలో రష్యన్ ప్రభుత్వ రహస్య స్థావరం ఉందని, ఆ స్థావరంలో ఒక బంకర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి రష్యన్ సేనలు రహస్య ఆయుధాలను దాచాయని అమెరికా ప్రభుత్వం ఆరోపణ చేయటం వలన ఈ పర్వతానికి ప్రాముఖ్యత వచ్చింది.
యామంటౌ పర్వతం | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 1,640 మీ. (5,380 అ.) |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 1,330 మీ. (4,360 అ.) |
నిర్దేశాంకాలు | 54°15′18″N 58°06′07″E / 54.255°N 58.102°E |
భౌగోళికం | |
స్థానం | బెలొరెట్స్కి జిల్లా, బష్కొర్తోస్తాన్, రష్యా |
పర్వత శ్రేణి | యూరల్ పర్వతాలు |
పేరు
మార్చుప్రాంతీయ బష్కిర్ భాషలో "యమన్ టౌ" అంటే క్రూరమైన పర్వతం, అని, చెడు పర్వతం అని, అర్ధాలున్నాయి.
బంకర్ కాంప్లెక్స్ ఉన్నట్టుగా ఆరోపణ
మార్చుఈ పర్వతంలో, ఈ పర్వతానికి ఉత్తరంగా 600 కి.మీ. దూరంలో ఉన్న కొస్విన్‌స్కి పర్వతంలో రహస్య స్థావరం(బంకర్ కాంప్లెక్స్) లేదా రహస్య అణుబాంబు పరీక్షణ కేంద్రం ఉన్నట్టుగా అమెరికా అనుమానిస్తోంది.సోవియట్ యూనియన్ పతనం తరువాత ఉపగ్రహాలతో అమెరికా నిత్యం ఇక్కడ నిఘా పెట్టి గమనిస్తూ ఉంది. ఈ ప్రదేశంలో పెద్ద స్థాయిలో తవ్వకాలు జరిపినట్టుగా గమనించింది. ఈ ప్రదేశంలోనే రష్యా యుద్ధంలో వాడిన పలు యుద్ధ ట్యాంకర్లు రూపొందించ బడ్డాయి. ఈ పర్వతం గురించి రష్యన్ ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం నిలదీసిన ప్రతి సారి పొంతనలేని వివిధ రకాల జవాబులు రష్యా ఇచ్చింది. గనుల ప్రదేశమని ఒక సారి, రష్యా ఖజానా దాచిపెట్టిన నిధి అనీ, ఆహారం నిలువ ఉంచిన ప్రదేశమని, అణు యుద్ధం జరిగితే ప్రముఖ నాయకులకు రక్షణ కల్పించే ప్రదేశమని చెపుతూ వచ్చింది. [1]
జనజీవన స్రవంతిలో
మార్చుకాల్ ఆఫ్ డ్యూటీ:బ్లాక్ ఆప్స్ అనే ఆటలో యమంటౌ పర్వతం ఒక స్థాయి(లెవెల్) గా ఉంది.
ఇవి కూడా చూడండి
మార్చుReferences
మార్చు- ↑ Gordon, Michael R. (April 16, 1996). "Despite Cold War's End, Russia Keeps Building a Secret Complex". The New York Times. Retrieved 28 February 2009.