యాలాల్ మండలం
యాలాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] యాలాల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 34 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
యాలాల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, యాలాల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°12′51″N 77°38′20″E / 17.214264°N 77.638779°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | యాలాల్ |
గ్రామాలు | 33 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 45,295 |
- పురుషులు | 22,128 |
- స్త్రీలు | 23,167 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.90% |
- పురుషులు | 54.72% |
- స్త్రీలు | 29.44% |
పిన్‌కోడ్ | 501144 |
గణాంకాలు
మార్చుమండల జనాభా
మార్చు2001 భారత జనగణన గణాంకాల ప్రకారము యాలాల మండల జనాభా 39451 (పురుషుల సంఖ్య 19537, మహిళలు 19914).అక్షరాస్యత (2011) - మొత్తం 41.90% - పురుషులు 54.72% - స్త్రీలు 29.44%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 198 చ.కి.మీ. కాగా, జనాభా 45,295. జనాభాలో పురుషులు 22,128 కాగా, స్త్రీల సంఖ్య 23,167. మండలంలో 9,514 గృహాలున్నాయి.[3]
సమీప మండలాలు
మార్చుఈ మండలానికి సమీపంలో తాండూరు మండలం ఉత్తరాన, బొంరాస్‌పేట తూర్పున, కొడంగల్ దక్షిణాన, పెద్దేముల్ మండలం ఉత్తరాన ఉన్నాయి. బొమ్మరాస్ పల్లి మండలం తూర్పున, బషీరాబాద్ మండలం పడమరన ఉన్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- అచ్యుతాపూర్
- అదలీపూర్
- అగ్గనూర్
- అంబర్పేట్
- అన్నాసాగర్
- బాణాపూర్
- బెన్నూర్
- భగాయిపల్లి
- చెన్నారం
- దేవనూర్
- దౌలాపూర్
- గంగాసాగర్
- గిరిజాపూర్
- గోరేపల్లి
- హాజీపూర్
- జక్కేపల్లి
- జుంటుపల్లి
- కమలాపూర్
- కిష్టాపూర్
- కోకట్
- లక్ష్మీనారాయణపూర్
- మజ్రాసంగం
- ముద్దాయిపేట్
- ముకుందాపూర్
- నాగసముందర్
- పగిడ్యాల్
- పాయర్కంపల్లి
- రాఘాపూర్
- రాస్నం
- తిమ్మాయిపల్లి
- విశ్వనాథ్‌పూర్
- యాలాల
- ఎంకపల్లి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ http://www.onefivenine.com/india/villages/Rangareddi/Yalal/Yalal[permanent dead link]