యావుజ్ సుల్తాన్ సెలిం వంతెన

యావుజ్ సుల్తాన్ సెలిం వంతెన, బాస్పోరస్‌ అనే జలసంధిపై నిర్మించారు.ఈ వంతెన పేరు యావుజ్‌ సుల్తాన్‌ సెలిం బ్రిడ్జ్‌. ఒట్టోమాన్‌ను పాలించిన రాజు యావుజ్‌ సుల్తాన్‌ సెలిం జ్ఞాపకార్థం ఈ వంతెనకు ఈ పేరు పెట్టారు.ఈ వంతెన నిర్మించడం వల్ల ఇస్తాంబుల్‌లో ట్రాఫిక్‌ కష్టాలు చాలా తగ్గాయి.ఈ వంతెన యూరప్‌, ఆసియాలను కలుపుతుంది.[1]

యవుజ్ సుల్తాన్ సెలిం వంతెన
Poyrazköy'den 3. köprü.jpg
జూలై 2015 లో నిర్మాణం సమయంలో వంతెన
అధికార నామంయవుజ్ సుల్తాన్ సెలిం వంతెన
ఇతర పేర్లుమూడవ బొస్పొరస్ వంతెన
మోసే వాహనాలునాలుగు మోటార్ వాహన దారులు, ప్రతి దిశలో ఒక రైల్వే లైన్
దేనిపై నిర్మింపబడినదిబొస్పొరస్
ప్రదేశంఇస్తాంబుల్
నిర్వహించువారుİçtaş
Astaldi
రూపకర్తమైఖెల్‌ విర్లోజెక్స్‌
వంతెన రకంహైబ్రిడ్ తీగల ఆధారిత, వేలాడే వంతెన
మొత్తం పొడవు2,164 m (7,100 ft)
వెడల్పు58.5 m (192 ft)
ఎత్తు322+ m (1,056+ ft)
పొడవైన స్పేన్1,408 m (4,619 ft)
నిర్మాణ ప్రారంభం2013
నిర్మాణ వ్యయంTurkish lira symbol 8x10px.png4.5 బిలియన్
ప్రారంభం26 ఆగస్టు 2016
టోల్$3.00
భౌగోళికాంశాలు41°12′10″N 29°06′42″E / 41.20291°N 29.11162°E / 41.20291; 29.11162Coordinates: 41°12′10″N 29°06′42″E / 41.20291°N 29.11162°E / 41.20291; 29.11162

వంతెన నిర్మాణంసవరించు

వంతెనకు డిజైన్‌ రూపొందించింది ఫ్రాన్స్‌కు చెందిన మైఖెల్‌ విర్లోజెక్స్‌ అనే ఇంజనీర్‌.ఒక వైపు మోటారు వాహనాల కోసం నాలుగు లైన్లు ఉంటాయి. ఒక రైల్వే లైను ఉంటుంది. రెండు లైన్లు కలుపుకుంటే ఎనిమిది వరుసల రహదారి, మధ్యలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి. సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌పై రైల్వే లైన్లు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి వంతెన ఇదే.రెండు స్తంభాల మధ్య దూరం 4600 అడుగులు ఉంటుంది. రెండు స్తంభాలను కలుపుతూ తీగలుంటాయు. ఆ తీగలపై వంతెన వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 2.1 కి.మీ. ఈ వంతెన నిర్మాణానికి వేలమంది కార్మికులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ వంతెన నిర్మించారు.[2]

మూలాలుసవరించు

  1. "Anadolu Ajansı - TURKEY UNVEILS ROUTE FOR ISTANBUL'S THIRD BRIDGE". web.archive.org. 2010-06-19. Retrieved 2020-01-28.
  2. "Yavuz Sultan Selim Bridge, Istanbul". Verdict Traffic (ఆంగ్లం లో). Retrieved 2020-01-28.

వెలుపలి లంకెలుసవరించు