యువత పునరుజ్జీవన దినం


యువత పునరుజ్జీవన దినం భారత మాజీ రాష్ట్రపతి, విజ్ఞాన వేత్త ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జ్ఞాపకార్థంగా ఆయన జన్మదినం అక్టోబరు 15 న జరుపబడే దినోత్సవం. అక్టోబరు15 ఆయన జన్మదినం రోజును యువత పునరుజ్జీవన దినం (యూత్‌ రినస్సెన్స్‌ డే) గా జరపనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.[1]

నేపథ్యం మార్చు

 
అబ్దుల్ కలాం

అబ్ధుల్‌ కలాం ఎల్లప్పుడూ ఉపాధ్యాయునిగా ఉండడానికే ఇష్టపడేవారని, యువతలో ఆయన నింపిన స్ఫూర్తి చాలా గొప్పది. భారత వృద్ధిలో ఆయన కృషి మరువలేనిది. ఆయన మిస్సైల్‌ మ్యాన్‌, న్యూక్లియర్‌ హీరో. శాస్త్రవేత్తగానే కాకుండా రాష్ట్రపతిగా దేశానికి చేసిన సేవ ఆదర్శనీయం. 2020 నాటికి భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదగాలన్న ఆయన ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కనుక తమిళనాడు ప్రభుత్వం ఈ దినాన్ని ప్రకటించడమే కాకుండా ఆయన పేరు మీద ఒక అవార్డును కూడా ప్రకటించింది.[2]

డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం అవార్డు మార్చు

మాజీ రాష్ట్రపతి, విజ్ఞాన వేత్త అబ్ధుల్‌ కలాం జ్ఞాపకార్థంగా ఆయన పేరుతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రదానం చేస్తుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో కలాం చేసిన సేవలకు గుర్తుగా, ఆ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రతీ సంవత్సరం స్వాతంత్య్రదినోత్సవం నాడు అందజేయాలని నిర్ణయించినట్లు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు కింద 8 గ్రాముల బంగారు పతకం, రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.[3] ఈ అవార్డును 2015 సంవత్సరం నుండి అందజేస్తారు.[4]

తపాలా బిళ్ళలు మార్చు

మిస్సైల్ మ్యాన్ అభ్దుల్ కలాం పేరుతో నాలుగు తపాలా స్టాంపులను కూడా రూపొందిస్తున్నట్లు తపాలాశాఖ చెన్నై డైరక్టరు తెలిపారు.[5]

మూలాలు మార్చు

  1. "Kalam's birthday to be observed as "Youth renaissance Day":TN Govt". OUT LOOK. Retrieved 31 July 2015.
  2. "కలాం పేరిట అవార్డు". Archived from the original on 2015-12-18. Retrieved 2015-08-05.
  3. Tamil Nadu's tribute to Kalam: Birthday to be observed as Youth Renaissance Day
  4. లాం పేరిట తమిళనాడు ప్రభుత్వం అవార్డు[permanent dead link]
  5. అబ్దుల్ కలాం పేరుతో అవార్డు -సాక్షి

ఇతర లింకులు మార్చు