యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హిందూమతం

(యు.ఎ.ఇ లో హిందూమతం నుండి దారిమార్పు చెందింది)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హిందువులు గణనీయమైన మైనారిటీగా ఉన్నారు. 2020 నాటికి దేశంలో 6,60,000 పైచిలుకు హిందువులు నివసిస్తున్నారు [1] యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న భారతీయుల్లో ప్రధానంగా ఉన్నది హిందువులే.

నేపథ్యం

మార్చు

UAE లో ముడి చమురు వెలికితీత, పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ, పట్టణీకరణ తర్వాత అనేక మంది కార్మికులు, ఉద్యోగులూ ఉపాధి కోసం UAEకి వచ్చారు. [2] చాలా మంది దక్షిణాసియా వాసులు పని కోసం అక్కడికి వలస వచ్చి, ఉపాధి పొందారు. 2000 తర్వాత, దుబాయ్ ప్రధానంగా దక్షిణ ఆసియన్లకు గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారింది. వారిలో చాలామంది హిందువులు. [3]

జనాభా వివరాలు

మార్చు

UAE లోని హిందూ డయాస్పోరాలో ఎక్కువ మంది భారతీయులు. వీరిలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్ నుండి వచ్చినవారు ఉన్నారు. [4] ఇతర హిందువులు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ నుండి వచ్చారు . [5] [6] [7]

దేవాలయాలు

మార్చు

రెండు అతిపెద్ద షేక్‌డమ్‌లలో ప్రస్తుతం ఒక హిందూ దేవాలయం మాత్రమే ఉంది. దుబాయ్ హిందూ దేవాలయం (స్థానికంగా "శివ, కృష్ణ ఆలయం" అని పిలుస్తారు) అద్దెకు తీసుకున్న వాణిజ్య భవనంలోని పై అంతస్తులో రెండు విగ్రహాలతో ఉన్న ఒక చిన్న ప్రార్థనా మందిరం. [8]

2013 జూలైలో ఒక ముస్లిం వ్యాపారవేత్త, అబు ధాబి నగరం వెలుపల, దుబాయ్ వైపు వెళ్లే హైవేకి దూరంగా స్వామినారాయణ ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి, అక్కడి మసీదుకు ఆనుకుని ఉన్న ఐదు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు. [9] 2015 ఆగస్టులో, UAE ప్రభుత్వం దానిపై హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తన యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశాడు. [10] [11] [12] అబుదాబిలో ఈ మొదటి హిందూ దేవాలయం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. [13] 2019 ఏప్రిల్‌లో కొత్త ఆలయం శంకుస్థాపన జరిగింది. [14] [15]

హిందూ సమాజం కోసం రెండు దహన సంస్కార శ్మశానాలు - ఒకటి అబుదాబిలో, ఒకటి దుబాయ్‌లో- ఉన్నాయి. [16]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "United Arab Emirates". U.S. Department of State. Retrieved 2021-05-24.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Marsh 2015e, p. 67.
  3. Marsh 2015e, p. 71.
  4. Said, Luxrai27; October 29, on; Pm, 2015 at 6:18 (2009-03-22). "The Hindu Diaspora In The Middle East". Kashmir Blogs (in ఇంగ్లీష్). Retrieved 2021-05-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  5. "Centre's intervention sought to help Indians stranded in Nepal". The Hindu (in Indian English). Special Correspondent. 2021-04-28. ISSN 0971-751X. Retrieved 2021-07-12.{{cite news}}: CS1 maint: others (link)
  6. "Did you know 250,000 Sri Lankans live in the UAE?". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
  7. "Hindu temples in the UAE: A symbol of tolerance". Maktoob Yahoo. Retrieved 12 July 2021.
  8. "First Hindu temple in Abu Dhabi: 8 things you may want to know" (in Indian English). Condé Nast Traveller India. 2019-04-03. Retrieved 2021-05-24.
  9. "Arab donates land for Swaminarayan temple in UAE".
  10. "UAE takes a 'landmark' decision, allots land for building first temple in Abu Dhabi".
  11. "UAE allots land for temple on Modi visit".
  12. "UAE decides to allot land for temple in Abu Dhabi".
  13. Bhattacherjee, Kallol (2018-02-06). "PM to lay foundation stone of temple in UAE". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-05-24.
  14. "First Hindu Mandir In Abu Dhabi, UAE, To Be Built By BAPS Swaminarayan Sanstha". Indo American News. Retrieved 2021-05-24.
  15. Ahmad, Anwar f. "Video: First Hindu temple's foundation stone laying ceremony in Abu Dhabi". Gulf News (in ఇంగ్లీష్). Dubai. Retrieved 2021-05-24.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. Kumar, Ashwani. "Look: Abu Dhabi Hindu temple rising 'at great pace'". Khaleej Times (in ఇంగ్లీష్). Retrieved 2021-05-24.