యూకలిప్టస్
యూకలిప్టస్ (ఆంగ్లం: Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి నీలగిరి తైలం తీస్తారు. కాగితపు పరిశ్రమలో దీని కలప ప్రధాన ముడిసరుకు.ఈ చెట్లు తక్కువ కొమ్మలతో నిటారుగా 12 నుండి 15 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. ఈ నీలగిరి చెట్లను కంచె లేకుండానే పెంచుకోవచ్చు. ఈ చెట్లను గాలి నిరోధకాలుగా పెంచుటకు అనువైనవి. ఇది సాగుకు పనికి రాని, రాళ్ళు రప్పలతో కూడిన కొండ ప్రాంత భూములలో కూడా సాగు చేయ వచ్చు. దీనిని యూకలిప్టస్, నీలగిరి, జామాయిల్ అను పేర్లతో పిలుస్తారు. దీనికి మరొక పేరు మైసూర్‌గం. దీనిని కాగితపు పరిశ్రమలో కాగితపు గుజ్జు తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని నుండి నాణ్యమైన కాగితపుగుజ్జు (pulp) తయారవుతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని అందించే రైతుల పాలిటి కల్పతరువు. ఐ.టి.సి.భద్రాచలం కాగితపు తయారీ పరిశ్రమవారు ఈ పంటను విశేషంగా ప్రోత్సహిస్తున్నారు.
యూకలిప్టస్ | |
---|---|
Eucalyptus melliodora foliage and flowers | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | యూకలిప్టస్ |
జాతులు | |
పెంచుటకు అనువైన నేలలు వాతావరణం About 700; see the List of Eucalyptus species | |
natural range |
రెయిన్‌బో యూకలిప్టస్
మార్చుదీని బెరడును ఒలిచినప్పుడల్లా చెట్టు మొత్తం ఇంధ్రదనస్సులా మారిపోతుంది. ఇవి సముద్ర మట్టం నుంచి 1,800 మీ. వరకు లోతట్టు, దిగువ పర్వత వర్షారణ్యాలలో పెరుగుతాయి. ఇవి ఇండోనేషియా, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్‌కు చెందినవి.[1]
| genus = నీలగిరి
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (2022-03-17). "RAINBOW EUCALYPTUS: రంగురంగుల చెట్లు..చూస్తే కళ్లు తిప్పుకోరంతే..!!". Namasthe Telangana. Retrieved 2022-03-18.