యే జవానీ హై దీవానీ

యే జవానీ హై దీవానీ 2013, మే 31 విడుదల అయిన హిందీ చిత్రం.

యే జవానీ హై దీవానీ 2013, మే 31 విడుదల అయిన హిందీ చిత్రం. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, ఆదిత్య రాయ్ కపూర్, కల్కీ కోచ్లిన్ నటించారు. ఈ సినిమా చిత్రీకరణను గుల్మార్గ్‌లోని కొంగ్‌డోరి, పహల్‌గాం, శ్రీనగర్ వంటి పలు ప్రాంతాల్లో జరిపారు.[4][5]

యే జవానీ హై దీవానీ
థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వంఅయాన్ ముఖర్జీ
రచనఅయాన్ ముఖర్జీ
హుస్సేన్ దలాల్
నిర్మాతహిరూ యశ్ జోహార్
కరణ్ జోహార్
తారాగణం
ఛాయాగ్రహణంవి. మణికందన్
కూర్పుఅకివ్ అలీ
సంగీతంప్రీతమ్
నిర్మాణ
సంస్థ
ధర్మ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుయుటివి మోషన్ పిక్చర్స్ (భారతదేశం)
ఈరోస్ ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ)
విడుదల తేదీ
31 మే 2013 (2013-05-31)
సినిమా నిడివి
159 నిముషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ[1]
బడ్జెట్40 కోట్లు[2]
బాక్సాఫీసు320 కోట్లు[3]

కబీర్ థాపర్ అలియాస్ బన్నీ (రణబీర్ కపూర్) ప్రపంచాన్ని పర్యటించాలని కలలు కనే, వివాహ బంధాలపై నమ్మకం లేని నిర్లక్ష్యపు వ్యక్తి. అతను తన తండ్రి ( ఫరూక్ షేక్), సవతి తల్లి (తన్వి అజ్మీ) తో నివసిస్తాడు. అవి (ఆదిత్య రాయ్ కపూర్), అదితి (కల్కి కోచ్లిన్) బన్నీకి మంచి స్నేహితులు. అదితి అవిని ప్రేమిస్తుంది. నైనా ( దీపికా పదుకొనే) బన్నీకి క్లాస్‌మేట్. బన్నీ మెడిసిన్ చదువుతుంటాడు. అవి, అథితి, నైనాతో కలిసి బన్నీ మనాలికి వెళతాడు. నైనా, బన్నీని ఇష్టపడుతుంది. ఆ తర్వాత ఒకరోజు నైనా తన ప్రేమను బన్నీకి చెప్పబోతుంది, అయితే బన్నీకి చికాగో విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్ వచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడు బన్నీకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదని చికాగో వెళ్తాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, బన్నీ తన స్నేహితురాలు అదితి పెళ్లి కోసం భారతదేశానికి తిరిగి వస్తాడు, అప్పుడు అతను మళ్లీ నైనాను చూస్తాడు. బన్నీ, నైనా లు ఎలా కలుస్తారు అనేది మిగతా కథ.[6]

నటవర్గం

మార్చు
  • రణబీర్ కపూర్
  • దీపికా పదుకొనే
  • కల్కి కోచ్లిన్
  • ఆదిత్య రాయ్ కపూర్  
  • కునాల్ రాయ్ కపూర్
  • ఎవెలిన్ శర్మ
  • ఫరూక్ షేక్
  • తన్వీ అజ్మీ
  • డాలీ అహ్లువాలియా  
  • పూర్ణ జగన్నాథన్  
  • రానా దగ్గుబాటి  
  • మాధురీ దీక్షిత్

పాటలు

మార్చు
నం. అంశం పాటల రచయిత గాయకుడు వ్యవధి
1. "బదతమీజ్ దిల్" అమితాబ్ భట్టాచార్య బెన్నీ దయాల్, షెఫాలీ అల్వారెస్ 4:12
2. "బలం పిచ్కారీ" అమితాబ్ భట్టాచార్య విశాల్ దద్లానీ , షల్మాలి ఖోల్గాడే 4:49
3. " ఇలాహి " అమితాబ్ భట్టాచార్య అరిజిత్ సింగ్ 3:33
4. " కబీరా " అమితాబ్ భట్టాచార్య రేఖా భరద్వాజ్, తోచి రైనా 3:43
5. "ఢిల్లీ వాలి గల్ఫ్రెండ్ " కుమార్ అరిజిత్ సింగ్, సునిధి చౌహాన్ 4:20
6. "సుభానల్లా" అమితాబ్ భట్టాచార్య శ్రీరామ్, శిల్పా రావు 4:09
7. "ఘాగ్రా" అమితాబ్ భట్టాచార్య విశాల్ దద్లానీ , రేఖ భరద్వాజ్ 5:04
8. "కబీరా (పునరావృతం)" అమితాబ్ భట్టాచార్య అరిజిత్ సింగ్, హర్షదీప్ కౌర్ 4:29
9. " ఇలాహి (ప్రతీకారం) " అమితాబ్ భట్టాచార్య మోహిత్ చౌహాన్ 3:52

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "YEH JAWAANI HAI DEEWANI | British Board of Film Classification". www.bbfc.co.uk. Retrieved 4 August 2020.
  2. "Yeh Jawaani Hai Deewani has biggest opening of the year". India Today. Retrieved 7 June 2013.
  3. "Yeh Jawaani Hai Deewani Box Office". Bollywood Hungama. Retrieved 16 March 2020.
  4. "Yeh Jawani Hai Deewani Cast & Crew | Cast Of Yeh Jawani Hai Deewani Hindi Movie - FilmiBeat". www.filmibeat.com. Retrieved 2023-05-12.
  5. Yeh Jawaani Hai Deewani (2013) - IMDb, retrieved 2023-05-12
  6. "फिल्म रिव्यू: ये जवानी है दीवानी". BBC News हिंदी. 2013-05-31. Retrieved 2023-05-12.