యోగము [ yōgamu ] yōgamu. సంస్కృతం n. Junction, meeting, union, కూడిక, కూర్పు. Fortune, అపూర్వ వస్తుప్రాప్తి. సద్యోగము a lucky conjuncture, good fortune, or luck. దుర్యోగము misfortune. దైవయోగము Divine Providence. దైవయోగము తప్పి unhappily, unfortunately. Accession of property, or wealth. ద్రవ్యము. A prescription, a recipe. ఔషధము, మహాబిల్వాది యోగము a prescription including Bilva roots.

యోగ శబ్దం ‘యుజ్‌ ’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టిందని అందరికి తెలిసినవిషయమే. ఆ ధాతువుకు కలిసికొనుట, ఏకమగుట, సమన్వయించుట మొదలైన అర్ధా లున్నాయి. జీవాత్మ పరమాత్మ లో సమ్యోగం చెందటమే యోగ పరమార్ధం. ‘ నయమాత్మాబలహీనేన లభ్యతే ’ అని ముండకోపనిషతు చెపుతోంది. అంటె బలహీనులు ఆత్మను తెలుసుకోలేరు, పొందలేరు అని భావం కాబట్టి ఆత్మ జ్ఞానానికి శక్తిమంతమైన శరీరము , సమాహితమైన బుధ్ధి అత్య అవసర మన్నమాట. దీని వల్ల క్రమంగా శరీరరోగ్యం సమాహితమైన చిత్తం ఏర్పడి ఆత్మను పరమాత్మతో సమ్యోగం చెందింప జేసే శక్తి సాధకుని కేర్పడుతుంది.

యోగ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తోడ్పడేవి ప్రధానంగా యోగానికి సంబంధించిన ఉపనిషత్తులు. వాటిలో యోగతత్వోపనిషతు, మండల బ్రాహ్మాణోపనిషతు, యోగకుండల్యోపనిషతు ప్రధానంగా పేర్కొన దగినవి. ఇవే గాక పాతంజలి యోగసూత్రాలు , భగవద్గీత , యోగ వాసిష్ఠం యోగజ్ఞానానికి ప్రమాణ గ్రంధాలు. పతంజలి యోగ సూత్రాలకు స్వామి వివేకానందులు ఆంగ్లంలో చేసిన అనువాదం అందరు చదువదగింది. పై గ్రంధాలన్నిట్లోనూ యోగం భారత దేశాంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి అధ్యయన అభ్యాసాలలో ఉన్నట్లు చెప్పబడి ఉంది.

యోగోపనిషత్తులలో యోగం నాలుగు విధాలుగా చెప్పబడింది. అవి , హఠయోగం , లయయోగం , మంత్రయోగం , రాజయోగం. అయితే, ఇప్పుడు యోగమంటే హఠ రాజాయోగాల సమ్మేళనం గా భావింప బడుతున్నది. దీనికే ఆష్టాంగయోగమని ప్రసిధ్ధి. ఆష్టాంగ యోగమంటే ఎనమిది అంగాలతో కూడిన యోగమని అర్ధం. యమ, నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార, ధారణ,ధ్యాన,సమాధులు అష్టాంగాలు.

1.యమ :- యమానికి పదిలక్షణా లున్నాయి. అవి,

1.అహింస - అపకారికి సైతం ప్రత్యపకారం చేయకపోవటం అహింస. 
2. సత్యం -సర్వకాల సర్వావస్థలయందు నిజమేమాట్లాడటం సత్యం
3. అస్తేయం - దోంగతనం చేయక పోవటం అస్తేయం.

4. బ్రహ్మచర్యం- బ్రహ్మచర్యదీక్ష గాని, శాస్త్రోక్తవిధి ననుసరించి గార్హస్థ్య ధర్మ నిర్వహణంగాని బ్రహ్మచర్యం

5. క్షమ- సర్వావస్థల యందును ఓర్పు కలిగి ఉండటం క్షమ
6. ధృతి -దైర్యం 

7. దయ - సర్వభూత దయ

8. అర్జవం -  శత్రు మిత్రులయందు సమభావం కలిగి ఉండటం ఆర్జవం
9. మితాహారం - మితంగా భుజించటం మితహరం

10. శౌచం. -ఆంతర్భహి శ్శుధ్ధి శౌచం


యోగము అనే విషయానికి సంబంధీంచిన పేజీలు

  • యోగా - వ్యాయామ, ఆధ్యాత్మిక సాధనల గురించి. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది.
"https://te.wikipedia.org/w/index.php?title=యోగము&oldid=1418050" నుండి వెలికితీశారు