యోగి పరమేశ్వరదాసు
యోగి పరమేశ్వరదాసు తెలంగాణ రాష్ట్రంకు చెందిన వాగ్గేయకారుడు.[1]
యోగి పరమేశ్వరదాసు | |
---|---|
జననం | జాజిరి పరమేశ్వరయ్య 1919 తెలంగాణ |
మరణం | ఆగస్టు 17, 1994 |
తండ్రి | భద్రయ్య |
తల్లి | చిన్నమ్మ |
జీవిత విశేషాలు
మార్చుపరమేశ్వరదాసు 1919 సంవత్సరంలో భద్రయ్య, చిన్నమ్మ దంపతులకు ఆదిలాబాదు జిల్లాలో జన్మించాడు. వీరి కుటుంబ వృత్తి బిక్షాటన. ఈయన రాసిన వాటిని పాడుకుంటూ వివిధ గ్రామాల్లో తిరిగేవాడు.[2]
సాహిత్య ప్రస్థానం
మార్చుశరణాగిరి కి చెందిన శ్రీశ్రీశ్రీ నరసింహ్మ యోగి దగ్గర ఉపదేశం పొందాడు. ఈయన రచన ఛందోబద్ధంగా, సరళ భాషతో కూడి ఉంటుంది. హిందీలో కూడా 25 కీర్తనలు రాశాడు.
- ఆత్మసాక్షాత్కార మార్గదర్శి (250 తత్వగీతాలు)
- యదార్థజ్ఞాన భోధామృతము (103 తత్వకీర్తనలు)
- మానవద్గీత (57 తత్వకీర్తనలు)
- శ్రీశ్రీ దత్తాత్రేయ భజనమాల (35 కీర్తనలు, 1 మంగళహారతి)
మరణం
మార్చుఈయన 1994, ఆగస్టు 17న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 27 November 2019.
- ↑ యోగి పరమేశ్వరదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట.54