ముగ్గు

ఇంటి వాకిట్లో నేలపై ముగ్గుపిండితో వేసే అలంకరణ విశేషం
(రంగవల్లులు నుండి దారిమార్పు చెందింది)

ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు.

సంక్రాంతి పండుగ నాడు, హైదరాబాదులోని ఓ ఇంటి ముందు వేసిన రథం ముగ్గు.
సింగపూర్‌లో ఓ ముగ్గు
అనంతపురంలో ముగ్గు

ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని సుద్ద ముక్కలను గాని తడిపి వేస్తారు.

ఆధునిక కాలంలో ఇంటిలోపలి ముగ్గులు కొందరు పెయింట్ తో వేస్తున్నారు. ఇవి రోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన, అంచుల వెంబడీ వేసుకుంటారు.

ముగ్గు తయారీ

మార్చు

ముగ్గు అనగా తెల్లగా ఉండే ఒక రకమైన పిండి. సాధారణంగా ముగ్గులు పెట్టేది వరిపిండి (బియ్యంపిండి)తో, తరువాత బట్టీల ద్వారా, నత్తగుల్లలు, ముగ్గు రాళ్ళతో ముగ్గును తయారు చేయడం మొదలెట్టడంతో దానిని అధికంగా వాడుతున్నారు.

ముగ్గులు రకాలు

మార్చు
 
రంగు రంగుల ముగ్గు
 
నెమలి ముగ్గు
  • సాంప్రదాయ ముగ్గులు

మామూలు పిండితో, పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.

  • రంగుల ముగ్గులు

కొన్ని విశేష సందర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో పక్షులు, జంతువులు, పువ్వులు కనిపిస్తాయి.

  • పండుగ ముగ్గులు

సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను బంతి పూల రేకులతోను, గొబ్బెమ్మ లతోను అలంకరిస్తారు.

  • చుక్కల ముగ్గు

ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.

  • రథం ముగ్గు

సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసే రంగుల ముగ్గులు వేసే పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గులకు ఇదే చివరి రోజు, ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులే.

వివిధ రాష్ట్రాల్లో ముగ్గులు

మార్చు

మధ్య భారతదేశంలో ప్రధానంగా ఛత్తీస్‌గర్ రంగోలిని చౌక్ అని పిలుస్తారు. సాధారణంగా ఇల్లు లేదా మరేదైనా భవనం ప్రవేశద్వారం వద్ద గీస్తారు. ఎండిన బియ్యం పిండి లేదా ఇతర రకాల తెల్ల దుమ్ము పొడి ముగ్గ్గురాయిని గీయడానికి ఉపయోగిస్తారు. అనేక సాంప్రదాయిక నమూనాలు ఉన్నప్పటికీ, దానిని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతను బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చి పెడుతుందని భావిస్తారు.

మహారాష్ట్ర, కర్ణాటకలలో, ఇళ్ళ తలుపులపై రంగోలి గీస్తారు, తద్వారా దుష్ట శక్తులు తిప్పికొట్టవచ్చని నమ్ముతారు. కేరళలోని ఓనం పండుగ సందర్భంగా, వేడుకల యొక్క ప్రతి పది రోజులలో ప్రతిదానికి పువ్వులు వేస్తారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో, ముగ్గు లేదా రంగోలి లేదా కోలం ప్రతిరోజూ గీస్తారు. రాజస్థాన్‌లో మందలను గోడలపై చిత్రించారు., వివిధ పండుగలు, ప్రధాన పండుగలు, బ్రుతువుల ఆధారంగా వర్గీకరించవచ్చు. దాని పరిమాణాన్ని బట్టి వివిధ ఆకృతులను కూడా పంచుకోవచ్చు.

కుమావున్ "రైటింగ్ బీట్" లేదా వివిధ రకాల ప్లాటింగ్ చిహ్నాలలో థాపా, కళాత్మక నమూనాలు, బెల్బుటోన్ ఉపయోగించబడుతుంది. ఒడిశాలో, ముర్జాను తులసి మొక్క ముందు ప్రతి ఇంటి అంగన్ వద్ద "తులసి చాహురా" అని పిలుస్తారు. రంగోలి నమూనాలు ఎక్కువగా కృష్ణుడు, జగన్నాథు లకు అంకితం చేయబడ్డాయి. ముర్జా పండుగ కార్తీక పూర్ణిమతో ముగిసే పవిత్ర కార్తీకా నెలలో పాటిస్తారు.

రంగోలిలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. దీపావళి వంటి ప్రత్యేక సందర్భాలలో ముగ్గులు వేస్తారు. దీపావళి రంగోలికి కొన్ని ప్రత్యేక నమూనాలు దీపా, దీపా గణేశ, లక్ష్మి, పువ్వులు లేదా భారతదేశ పక్షులు అని కూడా పిలుస్తారు.

రంగవల్లులు

మార్చు

ముగ్గుల పోటీలు

మార్చు

సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లోను, పట్టణలలోను సాధారణంగా నిర్వహిస్తారు. రథం ముగ్గు సంక్రాంతి ముగ్గులలో విశేషమైనది.

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు  

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ముగ్గు&oldid=4353592" నుండి వెలికితీశారు