రంపచోడవరం

ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండల గ్రామం
(రంప చోడవరం నుండి దారిమార్పు చెందింది)


రంపచోడవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం లోని జనగణన పట్టణం.[2] ఇది అదే మండలానికి కేంద్రం. ఇక్కడనుండి జిల్లా యంత్రాంగం వారానికి రెండు రోజులు పనిచేస్తుంది. [3] రంపచోడవరం దట్టమైన అడవి ప్రాంతానికి, జలపాతాలకు ప్రసిద్ది చెందింది, వీటిని రహదారి రవాణా ద్వారా మాత్రమే చేరుకోవటానికి అవకాశం ఉంది. రంపచోడవరంలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు. వారి ఉన్నతి కొరకు ప్రభుత్వం ఐ.టి.డి.ఏ. సంస్థను నెలకొల్పింది. గిరిజనుల సంస్కృతి, జీవన విధానం గురించిన మ్యూజియం శక్తి సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబడుతోంది.

పట్టణం
పటం
Coordinates: 17°26′20″N 81°46′37″E / 17.439°N 81.777°E / 17.439; 81.777
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండలంరంపచోడవరం మండలం
విస్తీర్ణం
 • మొత్తం4.99 కి.మీ2 (1.93 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం9,952
 • జనసాంద్రత2,000/కి.మీ2 (5,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి899
ప్రాంతపు కోడ్+91 ( 8864 Edit this on Wikidata )
పిన్(PIN)533288 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

పేరు వ్యుత్పత్తి

మార్చు

రంప అనే గ్రామం ప్రక్కగా ప్రవహించే వాగు పక్కనే ఈ ఊరు ఉంది. రంప అనే గ్రామం రెవెన్యూ లెక్కలలో మరో గ్రామంగా ఇప్పటికీ ఉంది.అయితే రంప గ్రామం, చోడవరం కలిపి రంపచోడవరం అయిందని తెలుస్తుంది.ఇక్కడ కొండమీద ఒక పురాతన శివాలయం ఉంది.

చరిత్ర

మార్చు

అల్లూరి సీతారామరాజు ఆ ఆలయంలో పూజ చేసుకునేవాడని తెలుస్తుంది. అక్కడ ఒక జలపాతం ఉంది. సంవత్సరం పొడుగునా ఈ జలపాతంలో నీరు ప్రవహిస్తుంటాయి.

భౌగోళికం

మార్చు

రంపచోడవరం 17.4500 ° N 81.7667 ° E. వద్ద ఉంది.సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 162 మీటర్లు (534 అడుగులు).[4]

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, రంపచోడవరం 2,485 గృహాలతో, 9,952 జనాభాను కలిగి ఉంది. మొత్తం జనాభాలో 5,242 మంది పురుషులు కాగా, 4,710 మంది స్త్రీలు ఉన్నారు.[5] ప్రతి 1000 మంది పురుషులకు 899 మంది స్త్రీలు సెక్స్ నిష్పత్తిగా కలిగి ఉంది. 0–6 సంవత్సరాల వయస్సు మధ్యగల పిల్లలు 943 మంది ఉన్నారు, వీరిలో 458 మంది బాలురు కాగా, 485 మంది బాలికలు ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 7,613 మంది అక్షరాస్యులతో 84.50% వద్ద ఉంది. ఇది రాష్ట్ర సగటు కంటే 67.41% ఎక్కువ గణనీయంగా ఉంది. [6]

పరిపాలన

మార్చు

రంపచోడవరం గ్రామ పంచాయితీ గ్రామ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సదుపాయాలు

మార్చు

దగ్గరలో రైలుస్టేషన్ రాజమండ్రిలో ఉంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Villages and Towns in Rampachodavaram Mandal of East Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  3. "Andhra Pradesh: IAS officer travels 200 km to hold grievance cell in Maoist hotbed". The Hindu. 2022-04-11. Retrieved 2022-07-26.
  4. "Maps, Weather, and Airports for Chodavaram, India". www.fallingrain.com. Retrieved 2020-07-01.
  5. "Rampachodavaram Population, Caste Data East Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-13. Retrieved 2022-10-12.
  6. https://www.censusindia.gov.in/2011census/dchb/2814_PART_B_DCHB_EAST%20GODAVARI.pdf

వెలుపలి లంకెలు

మార్చు