రఘు ఇంజినీరింగ్ కళాశాల

విశాఖపట్నంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల

రఘు ఇంజనీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం నగర శివార్లలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాల.[1] విశాఖపట్నం నుండి 37 కిమీ దూరంలో, విజయనగరం నుండి 17 కిమీ దూరంలో ఉంది.

రఘు ఇంజినీరింగ్ కళాశాల
రకంస్వయంప్రతిపత్తి
స్థాపితం2001
మాతృ సంస్థ
రఘు విద్యా సంస్థలు, విశాఖపట్నం
అనుబంధ సంస్థజవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం
చైర్మన్రఘు కలిదిండి
ప్రధానాధ్యాపకుడుడా.ఆర్.కామేశ్వరరావు
విద్యార్థులు3000+
స్థానంభీమునిపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, 531162, భారతదేశం
కాంపస్50 ఎకరాలు, శివారు
భాషఇంగ్లీష్
జాలగూడుhttps://www.raghuenggcollege.com/

చరిత్ర

మార్చు

ఈ కళాశాల 2001లో విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం మండలం దాకమర్రి గ్రామ శివారులో స్థాపించబడింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉంది. దీని చైర్మన్ కలిదిండి రఘు విద్యావేత్త.

సదుపాయాలు

మార్చు

40 ఎకరాలు (16000 చదరపు మీటర్లు) లో ఉన్న ఈ రఘు ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, సహాయక సౌకర్యాలకు నిలయంగా ఉంది. విద్యార్థుల కోసం వసతి గృహాలు ఉండడంతోపాటు, విశాఖపట్నం, విజయనగరం, భీమునిపట్నం నుండి డే స్కాలర్‌ల కోసం సొంత రవాణా సౌకర్యం ఉంది.

సౌకర్యాలలో లైబ్రరీ, వివిధ ప్రయోజనాల కోసం కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రత్యేక కామ్, కాడ్ ల్యాబ్‌ల ప్రోగ్రామ్ గైడెడ్ మెషిన్ ఆపరేషన్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నాయి.

రఘు ఇంజినీరింగ్ కళాశాల, రఘు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒకే ప్రాంతంలో ఉన్నాయి. వీటిని రఘు విద్యాసంస్థలు అంటారు. మొత్తం విద్యార్థులు 7000+ కంటే ఎక్కువ విద్యను అభ్యసిస్తున్నారు. రఘు ఇంజనీరింగ్ కళాశాల బిటెక్ లో అండర్ గ్రాడ్యుయేట్లు, ఎంటెక్ లో గ్రాడ్యుయేట్ వంటి స్ట్రీమ్‌లలో అందిస్తుంది.

మూలాలు

మార్చు
  1. Service, Hans News (2019-04-29). "Raghu Engineering College celebrates Achievers' Day". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-19.