మహమ్మద్ రజబ్ అలీ

(రజబ్ అలీ నుండి దారిమార్పు చెందింది)

మహమ్మద్ రజబ్ అలీ, (జనవరి 1 1920/ ఏప్రిల్ 10 1996) 1920 జనవరి 1న ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు. రజబ్ అలీ గారి తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద వీరికీ మొదటి సంతానం ఖాసిం బీ, మూడవ సంతానం మొయినుద్దిన్ కాగా, రెండవ సంతానం మహమ్మద్ రజబ్ అలీ గారు.

Rajab Ali Mohammad Khammam M.L.A (Ex)

మహమ్మద్ రజబ్ అలీ గారు వారి విద్యాభ్యాసం వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగింది. 9వ తరగతి వరకు విద్యను పూర్తి చేసి, ప్రభుత్వ ఉపాధ్యాయునుగా ఉట్కూరు గ్రామము నందు పని చేశారు.

ఆ తదుపరి ఉపాధ్యాయ వృత్తిని వదిలి, హైద్రాబాద్ నందు గల ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా ఆయన పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

ఖమ్మం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుండి 7 సార్లు ఎం.ఎల్.ఏ గా ఎన్నికయారు.[1] ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లులలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పనిచేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పనిచేసారు. తర్వాత కొత్త కాలానికి స్వగ్రామం చేరుకొని గ్రామ కరణంగా ఉంటుండగా జీవితం ఒక మలుపు తిరిగింది. కరణంగా పనిచేస్తూనే, ఆంధ్ర మహాసభ కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుడేవారు. ఆంధ్ర మహా సభకు సహకరిస్తునరనే నెపంతో ప్రభుత్వం ఆయనను మూడున్నర సవత్సరాల పాటు "డిటెన్యూ"గా నిర్బందిచింది. పటేల్, పట్వారి వస్త్రాలను ఆంధ్ర మహా సభ అద్వర్యంలో కాల్చివేస్తున్న తరుణంలో నాడు పట్వారిగా పనిచేస్తున్న ఖమ్మం తాలుక లోని గోకినేపల్లి గ్రామానికి చెందిన శ్రీ మచ్చా వీరయ్య గారు ఆంధ్ర మహా సభలలో చేరారు. ఆయన రాజకీయ జీవిత స్ఫూర్తికి, నిజాం నిరంకుశ విధానాలను ఎదిరించి పోరాడిన శ్రీ మచ్చా వీరయ్య కారకులు. ఖమ్మం తాలుక అద్యక్షులుగా శ్రీ పి. శ్రీనివాసరావు పనిచేస్తున్న కాల మైన 1944లో ఖమ్మంలో ఆంధ్ర మహా సభ సమావేశం జరిగినపుడు తన 24వ ఏట ఆంధ్ర మహా సభలో ప్రవేశించారు. ఆంధ్ర మహాసభ నిర్వహించిన అనేక భూమి, భుక్తి పోరాటాలలో ప్రత్యక్ష్య నాయకత్వం వహించారు. ఖమ్మం తాలుక ప్రాంతంలో వేలాది మంది ప్రజలు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఆకర్షించారు. తెలంగాణ సాయుధ పోరాటం సాగిన సమయంలో భూమి విముక్తి పోరాటంలో పాల్గొని చురుకైన పాత్ర పోషించారు. 1946లో నిజాం సేనలు ఆయనను అరెస్ట్ చేసి మూడు మాసాలు వరంగల్ జైలులో నిర్భదించాయి. 1947లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అదే సంవత్సరంలో ఆయనను అరెస్ట్ చేసి మూడు సంవత్సరాల మూడు మాసాలు వరంగల్, చంచల్ గూడా, ముషిరాబాద్ జైలు లలో బంధించారు. జైలు గోడల మద్య అనేక కష్టాలకు గురై క్షయవ్యాధి సోకి ఇబ్బందులకు లోనయ్యరు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ప్రచార బాధ్యతను నిర్వహించారు. కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన నందికొండ ప్రాజెక్ట్ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పాదయాత్రలకు నాయకత్వం వహించారు. గ్రామగ్రామాన ప్రజలను కదిలించి వేలాది మంది ప్రజలను ఉద్యమ భాగస్వాములను గావించారు. ప్రాజెక్ట్ సాధనకు తొలుత ఖమ్మం తాలుక గోళ్ళపాడు జరిగిన రైతు సదస్సులో పాల్గొన్నారు. సి.పి. ఐ 1955లో జగ్గయ్యపేటలో నిర్వహించిన అద్భుతంగా రైతు యాత్రకు ఖమ్మం జిల్లా నుండి వేలాది మందిని సమికరించరు.

చిత్ర మాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Shujatnagar Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2020-08-04.

బయటి లంకెలు

మార్చు