రణధీర్ సింగ్ కప్రివాస్

రణధీర్ సింగ్ కప్రివాస్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో రేవారి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రణధీర్ సింగ్ కప్రివాస్
రణధీర్ సింగ్ కప్రివాస్


పదవీ కాలం
2014 – 2019
ముందు అజయ్ సింగ్ యాదవ్‌
తరువాత చిరంజీవ్ రావు
నియోజకవర్గం రేవారి

వ్యక్తిగత వివరాలు

జననం (1946-04-04) 1946 ఏప్రిల్ 4 (వయసు 78)[1]
కప్రివాస్ రేవారి , భారతదేశం
రాజకీయ పార్టీ బీజేపీ (2024 ఫిబ్రవరి 6 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ (2005-2019)
తల్లిదండ్రులు శివతాజ్ సింగ్ యాదవ్
సంతానం 2 (కుమారులు)
4 (కుమార్తెలు)
నివాసం రేవారి, హర్యానా
పూర్వ విద్యార్థి పంజాబ్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రణధీర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 1996, 2000 హర్యానా శాసనసభ ఎన్నికలలో రేవారి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2005, 2009 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

రణధీర్ సింగ్ 2014 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి సతీష్ యాదవ్‌పై 45,466 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయనకు 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[3] రణధీర్ సింగ్ 2024 శాసనసభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 6న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Biography". oneindia.com.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. The Times of India (28 September 2024). "Heading for 2019 rerun? Rebel trouble still daunts BJP in Rewari". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
  4. TheDailyGuardian (6 February 2024). "Ex-MLA Randhir Singh Kapriwas returns to BJP in Haryana" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.