రణధీర్ సింగ్ గొల్లెన్
రణధీర్ సింగ్ గొల్లెన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో పుండ్రి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రణధీర్ సింగ్ గొల్లెన్ | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | దినేష్ కౌశిక్ | ||
---|---|---|---|
తరువాత | సత్పాల్ జాంబ | ||
నియోజకవర్గం | పుండ్రి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురణధీర్ సింగ్ గొల్లెన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో పుండ్రి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి దినేష్ కౌశిక్ చేతిలో 4,832 తేడాతో ఓడిపోయాడు. ఆయనకు 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ నుండి టిక్కెట్ నిరాకరించిన తరువాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సత్బీర్ భానాపై 12,824 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2019 ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఆరు తక్కువగా ఉన్న బిజెపికి తమ మద్దతును ప్రకటించి,[1] 2024 మే 7న తమ మద్దతును ఉపసంహరించుకున్నాడు.[2]
ఆయన 2024 శాసనసభ ఎన్నికలకు నుండి సెప్టెంబర్ 25న మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Times of India (26 October 2019). "The 7 legislators who have offered to extend support to BJP's M L Khattar". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ The Hindu (7 May 2024). "Haryana Political Crisis: 3 Independent MLAs withdraw support to BJP govt in Haryana" (in Indian English). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ एबीपी स्टेट डेस्क (25 September 2024). "हरियाणा: मतदान से पहले फिर बढ़ा कांग्रेस का कुनबा, ये विधायक पार्टी में शामिल". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.