రణ్ వీర్ సింగ్

భారతదేశపు ఒక బాలీవుడ్ నటుడు

రణ్ వీర్ సింగ్ భవ్నాని, (జననం 1985 జూలై 6) ఒకబాలీవుడ్ నటుడు. 2010లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో వచ్చిన బాండ్ బాజా బారాత్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాలోని నటనకు గాను, ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు. 2018లో నటి దీపిక పదుకొణెను వివాహం చేసుకున్నాడు.

రణ్ వీర్ సింగ్
Ranveer Singh promoting Bajirao Mastani.jpg
2015 లో బాజీరావ్ మస్తానీ ప్రచార కార్యక్రమంలో రణ్ వీర్
జననం
రణ్ వీర్ సింగ్ భావ్నాని

(1985-07-06) 1985 జూలై 6 (వయస్సు 36)[1]
విద్యాసంస్థఇండియానా విశ్వవిద్యాలయం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
జీవిత భాగస్వామిదీపిక పడుకోణె(m.2018-)

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

రణ్ వీర్ సింగ్ ముంబై లోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. అమెరికాలోని ఇండియానా యూనివర్శిటీలో బి. ఎ కాపీరైటింగ్ లో చేరాడు. నటనకు సంబంధించిన తరగతులకు హాజరయ్యాడు. [2]

సినిమా అవకాశాలుసవరించు

అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీ లో కాపీరైటర్ గా చేరి సినిమా ప్రయత్నాలు ప్రారంభించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ తాము నిర్వహిస్తున్న బ్యాండ్ బాజా బారాత్ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలిసి అందులో పాల్గొన్నాడు. అందులో ఇతనికి అవకాశం వచ్చింది. 2010లో విడుదలైన చిత్రం ఇతనికి శుభారంభాన్నిచ్చింది.[2]

మూలాలుసవరించు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; ht2013-03-18 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 "పెళ్లి కోసం మూడేళ్లు వేచి చూశాను!". eenadu.net. ఈనాడు. Archived from the original on 3 April 2019.