చాంద్ బర్క్
చాంద్ బర్కే (1932 ఫిబ్రవరి 2 - 2008 డిసెంబరు 28) హిందీ, పంజాబీ భాషా చిత్రాలలో నటించిన భారతీయ నటీమణి. ఈమె బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కి నాయనమ్మ.
చాంద్ బర్కే | |
---|---|
జననం | ఫిబ్రవరి 2, 1932 |
మరణం | 2008 డిసెంబరు 28 | (వయసు 76)
జాతీయత | భారతీయులు |
ఇతర పేర్లు | చాంద్ బర్క్ |
వృత్తి | నటి |
గుర్తించదగిన సేవలు | బూట్ పోలిష్ (1954) |
జీవిత భాగస్వామి | నిరంజన్ (div. 1954)సుందర్ సింగ్ భవ్నానీ
(m. 1955) |
పిల్లలు | 2 |
బంధువులు | శామ్యూల్ మార్టిన్ బర్కే (సోదరుడు) రణ్‌వీర్ సింగ్ (మనవడు) |
ప్రముఖ నటుడు రాజ్ కపూర్ బాలీవుడ్ చిత్రం బూట్ పోలిష్ (1954) లో ఆమె కీలక పాత్ర పోషించింది.[1][2]
కెరీర్
మార్చుచాంద్ బర్కే మహేశ్వరి ప్రొడక్షన్స్ కహన్ గయే (1946)లో ఆమె అరంగేట్రం చేసింది. లాహోర్‌లో నిర్మించిన అనేక చిత్రాలలో ఆమె నటించింది. అంతేకాకుండా పంజాబ్ డ్యాన్సింగ్ లిల్లీ అని విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశ విభజన సమయంలో ఆమె ముంబైకి వలస వెళ్ళడానికి దారితీసింది, తద్వారా ఆమె కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడింది.
వ్యక్తిగత జీవితం
మార్చుబ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) పన్నెండు మంది సోదరులు, సోదరీమణులతో కూడిన క్రైస్తవ కుటుంబంలో ఆమె జన్మించింది. ఆమె సోదరుడు శామ్యూల్ మార్టిన్ బర్క్, ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి, తరువాత పాకిస్తాన్ స్కాండినేవియన్ దేశాలకు దౌత్యవేత్తగా మారారు.[3] 1954లో ఆమె సినీ రచయిత, దర్శకుడు నిరంజన్ ను వివాహం చేసుకుంది. వీరు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తిరిగి 1955లో వ్యాపారవేత్త సుందర్ సింగ్ భవ్నానీని వివాహం చేసుకుంది. ఆమెకు తోన్యా అనే కుమార్తె, జగ్జిత్ అనే కుమారుడు ఉన్నారు. జగ్జిత్ కుమారుడే బాలీవుడ్ చలనచిత్ర నటుడు రణవీర్ సింగ్.
ఫిల్మోగ్రఫీ
మార్చుYear | Film |
1969 | పరదేశన్ |
1968 | కహిన్ దిన్ కహిన్ రాత్ |
1967 | మేరా భాయ్ మేరా దుష్మన్ |
1965 | మొహబ్బత్ ఇస్కో కహేతే హై |
1964 | అప్నే హుయే పరాయే |
1960 | ఘర్ కీ లాజ్ |
1960 | రంగీలా రాజా |
1960 | శ్రవణ్ కుమార్ |
1959 | పరదేశి ధోలా |
1958 | అదాలత్ |
1958 | లజ్వంతి |
1958 | సోహ్ని మహివాల్ |
1957 | దుష్మన్ |
1956 | బసంత్ బహార్ |
1955 | రాఫ్తార్ |
1955 | షాహి చోర్ |
1954 | 'ఫెర్రీ' |
1954 | అమర్ కీర్తన్ |
1954 | గుల్ బహార్ |
1954 | బూట్ పోలిష్ |
1954 | వంజర |
1953 | ఆగ్ కా దరియా |
1953 | కౌడే షా |
1951 | సబ్జ్ బాగ్ |
1951 | పోస్టి |
1948 | దుఖియారి |
1946 | కహన్ గయే |
మూలాలు
మార్చు- ↑ "Did you know that Ranveer Singh's grandmother Chand Burke was a popular Bollywood actress?". The Times of India. Bennett, Coleman & Co. Ltd. Retrieved 1 August 2020.
- ↑ "Did you know Ranveer Singh's grandmother Chand Burke was an actress". Filmfare. Retrieved 1 August 2020.
- ↑ "Chand Burke". Cineplot.com. Retrieved 1 August 2020.