రతన్‌సిన్హ్ రాథోడ్

రతన్‌సిన్హ్ మగన్‌సిన్హ్ రాథోడ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రతన్‌సిన్హ్ మగన్‌సిన్హ్ రాథోడ్

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
తరువాత రాజ్‌పాల్‌సింగ్ జాదవ్
నియోజకవర్గం పంచ్‌మహల్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2017 – 2019
నియోజకవర్గం లూనావాడ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

రాజకీయ జీవితం

మార్చు

రతన్‌సిన్హ్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 నుండి 2000 వరకు లక్డి పోయిడా సర్పంచ్‌గా, 2000 నుండి 2019 వరకు మహీసాగర్ జిల్లా పంచాయతీ సభ్యుడిగా, 2015 నుండి 2018 వరకు జిల్లా విద్యా కమిటీ అధ్యక్షుడిగా, 2017 నుండి 2019 వరకు గుజరాత్ శాసనసభ్యుడిగా పని చేసి[3], 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఖంత్ వెచత్ భాయ్ కుబేర్ భాయ్ పై 4,28,541 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[4] 13 సెప్టెంబర్ 2019 నుండి 12 సెప్టెంబర్ 2020 వరకు పార్లమెంట్‌లో మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 13 సెప్టెంబర్ 2019 నుండి 2024 వరకు కన్సల్టేటివ్ కమిటీ, భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ సభ్యుడిగా పని చేశాడు.

మూలాలు

మార్చు
  1. The Indian Express (28 March 2019). "Gujarat BJP's fresh picks: State minister, Independent MLA and a builder" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  2. Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  3. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.