2019 భారత సార్వత్రిక ఎన్నికలు
భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే 2019 భారత సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరిగింది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తయ్యింది. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.
![]() | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
స్థానం ప్రకారం ఫలితాలు. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
90 కోట్ల ప్రజలు ఓటుహక్కుగలవారు కాగా రికార్జుస్థాయిలో 67 శాతం మందివోటు వేశారు మహిళల వోటువేయటం కూడా అత్యధిక స్థాయిలో జరిగింది.[1][2][వివరం 2]
భారతీయ జనతా పార్టీ ముందు కంటె ఎక్కువగా మొత్తం 303 స్థానాలు గెలిచింది[4] బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ 353 స్థానాలు గెలిచిది.[5] భారత జాతీయ కాంగ్రెస్ 52 స్థానాలు, కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ మొత్తం 91 స్థానాలు గెలిచింది. ఇతర పార్టీలు , వాటి కూటములు స్థానాలు గెలిచాయి.[6] భారత జాతీయ కాంగ్రెస్ 10% స్థానాలు అనగా 55 స్థానాల కంటె తక్కువ సాధించడంతో అధికార ప్రతిపక్ష పార్టీ స్థాయి కాలేకపోయింది.[7][8]
ఎన్నికల షెడ్యూలుసవరించు
మార్చి 10 న ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.[9] ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయన తెలిపాడు.[10]
మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | ||
పోలింగు తేదీ | 2019 ఏప్రిల్ 11 | 2019 ఏప్రిల్ 18 | 2019 ఏప్రిల్ 23 | 2019 ఏప్రిల్ 29 | 2019 మే 6 | 2019 మే 12 | 2019 మే 19 | ||
లెక్కింపు తేదీ | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | ||
నియోజక వర్గాలు | 543 | 91 | 97 | 115 | 71 | 51 | 59 | 59 | |
ఒకే దశ | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | ఆంధ్ర ప్రదేశ్ | 25 | 25 | ||||||
2 | అరుణాచల్ ప్రదేశ్ | 2 | 2 | ||||||
3 | గోవా | 2 | 2 | ||||||
4 | గుజరాత్ | 26 | 26 | ||||||
5 | హర్యానా | 10 | 10 | ||||||
6 | హిమాచల్ ప్రదేశ్ | 4 | 4 | ||||||
7 | కేరళ | 20 | 20 | ||||||
8 | మేఘాలయ | 2 | 2 | ||||||
9 | మిజోరం | 1 | 1 | ||||||
10 | నాగాల్యాండ్ | 1 | 1 | ||||||
11 | పంజాబ్ | 13 | 13 | ||||||
12 | సిక్కిమ్ | 1 | 1 | ||||||
13 | తమిళనాడు | 39 | 39 | ||||||
14 | తెలంగాణ | 17 | 17 | ||||||
15 | ఉత్తరాఖండ్ | 5 | 5 | ||||||
16 | అండమాన్ నికోబార్ దీవులు | 1 | 1 | ||||||
17 | దాద్రా నగర్ హవేలి | 1 | 1 | ||||||
18 | దామన్ డయ్యు | 1 | 1 | ||||||
19 | పుదుచ్చేరి | 1 | 1 | ||||||
20 | చండీగఢ్ | 1 | 1 | ||||||
21 | ఢిల్లీ | 7 | 7 | ||||||
22 | లక్షద్వీప్ | 1 | 1 | ||||||
2 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | కర్ణాటక | 28 | 14 | 14 | |||||
2 | మణిపూర్ | 2 | 1 | 1 | |||||
3 | రాజస్థాన్ | 25 | 13 | 12 | |||||
4 | త్రిపుర | 2 | 1 | 1 | |||||
3 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
6 | అస్సాం | 14 | 5 | 5 | 4 | ||||
7 | చత్తీస్ గఢ్ | 11 | 1 | 3 | 7 | ||||
4 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | జార్ఖండ్ | 14 | 3 | 4 | 4 | 3 | |||
2 | మధ్య ప్రదేశ్ | 29 | 6 | 7 | 8 | 8 | |||
3 | మహారాష్ట్ర | 48 | 7 | 10 | 14 | 17 | |||
4 | ఒరిస్సా | 21 | 4 | 5 | 6 | 6 | |||
5 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | జమ్మూ కాశ్మీరు | 6 | 2 | 2 | 1[వివరం 3] | 1 | 2 | ||
7 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | బీహార్ | 40 | 4 | 5 | 5 | 5 | 5 | 8 | 8 |
2 | ఉత్తర్ ప్రదేశ్ | 80 | 8 | 8 | 10 | 13 | 14 | 14 | 13 |
3 | పశ్చిమ బెంగాల్ | 42 | 2 | 3 | 5 | 8 | 7 | 8 | 9 |
ఫలితాలుసవరించు
352 | 91 | 99 |
ఎన్.డి.ఏ | యూ.పి.ఏ. | ఇతరులు |
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యతతో గెలిచింది. భాజాపా ఏకపక్షంగా లోకసభలో 303 స్థానాలు ఊహించినదానికంటే ఎక్కువగా గెలిచి,భాగస్వామ్య పక్షాలతో కూడిన ఎన్డిఎ 353 స్థానాలు గెలిచింది.[11] గెలవటానికి కారణాలుగా నరేంద్ర మోడీ వ్యక్తిగత ఆదరణ, బిజేపీ ప్రోద్బలంతో ఎక్కువశాతం పోలింగ్ జరగడం, ఫుల్వామా దాడి తదుపరి ఉవ్వెత్తున వీచిన జాతీయతావాదం, సామాజిక సంక్షేమాల పధకాల సమర్ధవంతంగా నిర్వహించడం లాంటివి.[12]
ఇతర విశేషాలుసవరించు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:
- జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.[14] ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధన ఎన్నికల కమిషనరు అన్నాడు.
- ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
- సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
- వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.
- నిజామాబాద్ లోక సభ నియోజకవర్గానికి దేశంలోనే రికార్డు స్థాయిలో 185 మంది పోటీ చేస్తుండండంతో ఆధునీకరించిన ఎమ్-3 ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాన్ని వాడబోతున్నారు.[15]
ఇవీ చూడండిసవరించు
నోట్స్సవరించు
- ↑ రెండు స్థానాలు ఆంగ్లో ఇండియన్స్ కొరకు కేటాయించబడి, రాష్ట్రపతి నియమిస్తాడు, ఒక స్థానంలో ఎన్నిక రద్దుచేయబడింది.
- ↑ In 9 states and union territories of India – such as Arunachal Pradesh, Kerala and Uttarakhand – more women turned out to vote than men in 2019.[3]
- ↑ జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. అందుచేత ఈ నియోజక వర్గాన్ని మూడు దశల్లోనూ చూపించాం. అందుచేతనే అన్ని దశల్లోని నియోజకవర్గాల సంఖ్యను కూడితే అసలు కంటే 2 నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయి.
మూలాలుసవరించు
- ↑ At 67.1%, 2019 turnout's a record: Election Commission, The Times of India (20 May 2019)
- ↑ Polls Are Closed in India's Election: What Happens Next?, The New York Times, Douglas Schorzman and Kai Schultz (19 May 2019)
- ↑ Women turn out in greater numbers than in previous elections, The Economic Times, Aanchal Bansal (20 May 2019)
- ↑ "India Election Results: Modi and the B.J.P. Make History". NYT. Retrieved 23 May 2019.
- ↑ "Modi thanks India for 'historic mandate'" (in ఇంగ్లీష్). 2019-05-23. Retrieved 2019-05-29.
- ↑ 6.0 6.1 6.2 "Lok Sabha Election 2019 - Party Alliance Details, General Elections". India Today. Retrieved 27 May 2019.
- ↑ "Narendra Modi government will not have Leader of Opposition in Lok Sabha again". Prabhash K Dutta. India Today. 24 May 2019. Retrieved 28 May 2019.
- ↑ "Congress Fails To Get Leader Of Opposition Post In Lok Sabha, Again". Puneet Nicholas Yadav. Outlook. 24 May 2019. Retrieved 28 May 2019.
- ↑ "Full Schedule of LokSabha Elections: 7-phase polling in UP, Bihar". ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 10 Mar 2019. Archived from the original on 10 Mar 2019.
- ↑ "మోగింది భేరి". ఈనాడు. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019. Retrieved 11 Mar 2019.
- ↑ "Election Commission of India". eci.gov.in. Archived from the original on 2008-12-07. Retrieved 2019-06-11.
- ↑ https://www.hindustantimes.com/lok-sabha-elections/bjp-cements-its-position-as-central-pole-of-indian-polity/story-kPMHLAIt3d2jX0GXc67DAJ.html
- ↑ "Lok Sabha Election 2019". Oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 4 June 2019.
- ↑ "ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్." సాక్షి. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019.
- ↑ "వందలాది ఇంజినీర్లు ..వేలాది ఈవీఎంలు". ఈనాడు. 4 Apr 2019. Archived from the original on 4 Apr 2019.
ఉదహరింపు పొరపాటు: "note" అనే గుంపుకు <ref>
ట్యాగులున్నాయి, కానీ సంబంధిత <references group="note"/>
ట్యాగేదీ కనబడలేదు. లేదా మూసే </ref>
లేదు