సర్ రతాంజీ టాటా ( 1871 జనవరి 20-5 1918 సెప్టెంబర్ 5) భారతీయ వ్యాపారవేత్త . రతాంజీ టాటా టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా చిన్న కుమారుడు.

Sir
Ratanji Tata
జననం(1871-01-20)1871 జనవరి 20
Bombay, British India
మరణం1918 సెప్టెంబరు 5(1918-09-05) (వయసు 47)
విశ్వవిద్యాలయాలుUniversity of Bombay
భార్య / భర్త
Navajbai Sett
(m. 1893)
పిల్లలుNaval Tata (adopted)
బంధువులుJamsetji Tata (father)
Dorabji Tata (brother)
Ratan Tata (grandson)
తండ్రిJamsetji Tata

జీవితచరిత్ర

మార్చు

రతాంజీ టాటా ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా కు బ్రిటిష్ ఇండియా లోని బొంబాయిలో జన్మించారు. రతాంజీ టాటా బొంబాయి సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదువుకున్నాడు, తరువాత తన తండ్రి స్థాపించిన టాటా గ్రూప్ సంస్థలో చేరాడు. 1904లో జంషెడ్జీ టాటా మరణించిన తరువాత, రతాంజీ టాటా అతని సోదరుడు దోరాబ్జీ టాటా జంషెడ్జీ టాటా స్థాపించిన టాటా గ్రూపుకు వారసులు అయ్యారు, తరువాత టాటా గ్రూప్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు.

1905లో రతాంజీ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ బెంగళూరు లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మెడికల్ రీసెర్చ్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ) స్థాపించింది, 1912లో రతాంజీ టాటా టాటా స్టీల్ ను ప్రారంభించారు, టాటా స్టీల్ ప్రారంభించిన కొన్ని రోజులకే గణనీయమైన విజయాన్ని సాధించింది, టాటా సంస్థలలో అత్యంత ముఖ్యమైనది గా టాటా స్టీల్ నిలిచింది ‌. టాటా స్టీల్ పశ్చిమ కనుమలలో 1915 సంవత్సరంలో నీటి శక్తిని నిల్వ చేయడం, ఇది బొంబాయికి అపారమైన విద్యుత్ శక్తిని అందించింది, తద్వారా దాని పరిశ్రమల ఉత్పాదక సామర్థ్యాన్ని బాగా పెంచింది.

 
1899లో నవజ్బాయి టాటా

1916లో నైట్ పదవి పొందిన సర్ రతాంజీ టాటా టాటా గ్రూపును భారతదేశానికే పరిమితం చేయలేదు టాటా గ్రూప్ ను రతాంజీ టాటా విదేశాలకు విస్తరింపజేశాడు. , రతాంజీ టాటా 1912 సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ను స్థాపించాడు, అలాగే రతాంజీ టాటా లండన్ విశ్వవిద్యాలయం ద్వారా పేద వద్యార్థులకు విద్యను అందించడానికి టాటా ఎడ్యుకేషన్ ఫండ్ ను ప్రారంభించాడు.1909లో, రతాంజీ టాటా మహాత్మా గాంధీ కి 40 కోట్లు విరాళంగా ఇచ్చాడు. రతాంజీ టాటా ఇచ్చిన ఈ విరాళం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నిరసనల ఆర్థిక భద్రతను పొందడంలో సహాయపడింది.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

రతాంజీ టాటా 1893లో నవజబాయి సెట్ ను వివాహం చేసుకున్నాడు తరువాత 1915 సంవత్సరంలో ఇంగ్లాండ్ కి వెళ్ళారు. రతాంజీ టాటా కు సంతానం లేకపోవడంతో బంధువుల నుంచి ఒక పిల్లాడిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. 1918 సెప్టెంబర్ 6న రతాంజీ టాటా ఇంగ్లాండ్లోని కార్న్వాల్లోని సెయింట్ ఇవ్స్ వద్ద రతాంజీ టాటా మరణించాడు లండన్ సమీపంలోని వోకింగ్ లోని బ్రూక్వుడ్ సిమెట్రీలో రతాంజీ టాటా తండ్రి (జామెత్జీ టాటా) పక్కన ఖననం చేయబడ్డాడు.[2]

బొంబాయి వ్యాపారి దోరాబ్జీ సక్లత్వాలాను వివాహం చేసుకున్న అత్త జెర్బాయి టాటా ద్వారా, అతను తరువాత బ్రిటిష్ పార్లమెంటులో కమ్యూనిస్ట్ సభ్యుడైన షాపూర్జీ సక్లుత్వాలాకు బంధువు.[3]

వారసత్వం.

మార్చు

రతాంజీ టాటా మరణం తరువాత సర్ రతాంజీ టాటా ట్రస్ట్ 1919లో 8 కోట్ల తో స్థాపించబడింది.[2]

మూలాలు

మార్చు
  1. Guha, Ramchandra (2013). Gandhi Before India. Penguin Books India. pp. 385–386, 400. ISBN 9780143429647.
  2. 2.0 2.1 "More than a businessman". Tata Group website. August 2008. Archived from the original on 8 November 2011. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ta" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. Oxford Dictionary of National Biography. Vol. 48. Oxford University Press. 1904. pp. 675–676. ISBN 0-19-861398-9.Article on Saklatvala by Mike Squires, who refers to Jamsetji as J.N. Tata.