రదనికలు (Canines) క్షీరదాలలో విషమ దంత విన్యాసంలో ఉంటాయి. ఇవి కుంతకాలకు వెనుకగా మొనదేలి ఉంటాయి. అడవి పంది మొదలైన మాంసాహార జంతువులల్లో వీటినే కోరలు అంటారు. లాగోమార్ఫా, రొడెన్షియా లలో ఇవి లోపించి ఉంటాయి.

రదనికలు
This dog's longer pointed cuspids show why they are particularly associated with canines.
Permanent teeth of right half of lower dental arch, seen from above.
లాటిన్ dentes canini
గ్రే'స్ subject #242 1116
MeSH Cuspid

చరిత్ర

మార్చు

కుక్క కోరలతో పోలిక ఉన్నందున వీటికి కుక్కల పళ్ళు పేరు పెట్టబడ్డాయి. మనుషుల నోటిలో ఈ దంతాలు పొడవుగా, పదునైనవి కావు, కానీ అవి ఒకే తీరుగా , ఇతర దంతాలతో చుస్తే ఇవి ఎక్కువ పొడవుగా ఉంటాయి . అమెరికన్ డెంటల్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం, శిశువుకు 16 నెలల వయస్సు వచ్చిన తరువాత మొదటి దవడ పంటి సాధారణంగా పై దవడలో విస్ఫోటనం చెందుతుంది, తరువాత 23 నెలల వయస్సులో అన్ని దంతాలు ( పళ్ళు) రావడం జరుగుతుంది , పిల్లలు 9 నుండి 12 సంవత్సరాల వయస్సులో వారి ప్రాధమిక పళ్ళను కోల్పోతారు. పొడవుగా ఉన్న కోర పళ్ళు ఎందుకు అవసరం? ఈ పళ్లతో తినడం, మాట్లాడటం, పెదవుల ఆకారాన్ని కాపాడుకోవడం తో పాటు ఇతర దంతాలను స్థానానికి మార్గనిర్దేశం చేయడంలో ఈ దంతాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పొడవైన కోర పళ్లతో ఆహారము లో ఉన్న గట్టి పదార్థములను ముక్కలు గా చేయడం, మనుషులు తినే ఆహరం లో తొందరగా జీర్ణం కావడము జరుగుతుంది , మనుషులు మాట్లాడేటప్పుడు పదాలను రూపొందించడంలో సహాయపడతాయి. దవడ తిరగడములో పళ్ళ సమతుల్యతను కోర పళ్ళు సహాయ పడతాయి. కోర పళ్ళు ఆకారం , వాటి నిర్మాణం నోటిలో ఏంతో సహాయ పడతాయి , ఈ కోర పళ్లను బ్రష్ చేస్తున్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే మనుషులకు ఏంతో మేలు జరుగుతుంది [1]

నాలుగు కోరలు పదునైన దంతాలు గా అని పిలుస్తారు . ప్రాధమిక వచ్చే కోరలు 16, 20 నెలల మధ్య కనిపిస్తాయి, 9 సంవత్సరాల వయస్సులో విస్ఫోటనం చెందుతాయి, పైన వచ్చే కోర పళ్ళు 11-12 సంవత్సరాల వయస్సులో వస్తాయి. కోరలు దంతాల ‘మూలల్లో’ ఉన్నాయి. ఈ కోర పళ్ల పొడవుగా ,పదునైనవిగా ఉండటంతో ఈ దంతములను మాంసాహార జంతువుల పాలతో పోలుస్తారు. ఈ దంతాల చుట్టూ చిగుళ్ళ కణజాలం క్షీణించే ప్రమాదాన్ని తగ్గించడానికి, పళ్ళు తోముకోవడం లో జాగ్రత్త చాలా అవసరం ఎందుకంటే ఇది చిగుళ్ళు, ఎనామెల్ ఉపరితలాలను రక్షించడంలో సహాయ పడుతుంది .[2]

మూలాలు

మార్చు
  1. "What Is A Canine Tooth?". www.colgate.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-14.
  2. "What is the role of canine teeth?". www.omdentalllc.com. Retrieved 2020-12-14.
  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=రదనికలు&oldid=3099478" నుండి వెలికితీశారు