రన్ 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సందీప్ కిషన్, అనిషా ఆంబ్రోస్ ప్రధాన పాత్రలలో నటించారు. అజయ్ సుంకర, కిషోర్ గరికిపాటి సంయుక్తంగా నిర్మించగా అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2016 మార్చి 23 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఇది మలయాళం తమిళ ద్విభాషా చిత్రం నేరం యొక్క రీమేక్. [2]

రన్
దర్శకత్వంఅనిల్ కన్నెగంటి
కథఅల్ఫోన్స్ పుతరెన్
నిర్మాతసుధాకర్ చెరుకూరి
కిషోర్ గరికిపాటి
అజయ్ సుంకర
తారాగణంసందీప్ కిషన్
అనిషా ఆంబ్రోస్
ఛాయాగ్రహణంబి. రాజశేఖర్
కూర్పుఎం ఆర్ వర్మ
సంగీతంకె. సాయి కార్తీక్
విడుదల తేదీ
23 మార్చి 2016 (2016-03-23)([1])
సినిమా నిడివి
110 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

సంజయ్ అలియాస్ సంజు ( సుందీప్ కిషన్ ), అముల్య అలియాస్ అమ్ము ( అనిషా అంబ్రోస్ ) ల కథే రన్.

సంజు కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అతడు ఉద్యోగం కోల్పోయాడు. వట్టి రాజా ( బాబీ సింహా ) అనే మనీలెండర్ నుండి అప్పు తీసుకున్నాడు. అతనికి ఆదాయం లేసు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేడు. ఏ ఉద్యోగమూ లేని సంజుతో అమ్ముకు పెళ్ళి చెయ్యనని ఆమె తండ్రి శ్రీనివాస్ ( యనమదల కాశీ విశ్వనాథ్ ) నిరాకరిస్తాడు. అమ్ము సంజుతో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. అతని స్నేహితుడు మణి ( ప్రవీణ్ ) రాజాకు తన అప్పు తీర్చడానికి డబ్బు ఇస్తాడు. వారి మార్గంలో, అమ్ము గొలుసు లాక్కుపోతారు. సంజు డబ్బు పోతుంది. రాజా సంజును పిలిచి 5PM లోపు తన డబ్బును ఇచ్చెయ్యాలని కోరతాడు.

అమ్మును అపహరించాడనే ఆరోపణలపై శ్రీనివాస్ సంజుపై సబ్ ఇన్‌స్పెక్టర్ పద్మావతి ( బ్రహ్మజీ ) కు ఫిర్యాదు చేసి అతని నంబర్ ఇస్తాడు. పద్మావతి సంజును పిలిచి, అమ్ముతో కలిసి సాయంత్రం 5 గంటల లోపల పోలీస్ స్టేషన్కు రావాలని చెప్తాడు. కాని ఇంకా సమస్యలు పూర్తి కాలేదు; సంజు సోదరుడు ( మధునందన్ ) వ్యాపారం ప్రారంభించడానికి అతని నుండి కొంత డబ్బు అడుగుతాడు (అది కూడా సాయంత్రం 5 గంటలకే). మరోవైపు, అమ్ము వేరే వ్యక్తి స్నేహితురాలని పొరపాటుగా భావించి,ను రాజా మనుషులు ఆమెను కిడ్నాప్ చేస్తారు, ఆ వ్యక్తి రాజాకు డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంది.

సంజు తన గొలుసును లాక్కున్న వ్యక్తిని చూసి అతని గొలుసును తాను లాక్కోవాలని నిర్ణయించుకుంటాడు. కాని దురదృష్టవశాత్తు, సరిగ్గా అతను గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించే సమయంలోనే, ఆ వ్యక్తి ప్రమాదంలో గాయపడతాడు. సంజు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళతాడు. ఆ వ్యక్తి సోదరుడు పోసాని బాలకృష్ణ ( పోసాని కృష్ణ మురళి ) సంజుకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తాడు. అకస్మాత్తుగా, పద్మావతి అక్కడికి చేరుకుని రాజా ప్రమాదంలో మరణించాడని చెబుతాడు. అమ్ము గొలుసు, సంజు డబ్బును దొంగిలించిన లైట్హౌస్ (శని సాల్మన్) రాజా నుండి కొంత డబ్బు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అతను ఆ డబ్బును తమవద్దే ఉంచేసుకోడానికి, రాజా కారును దొంగిలించడానికీ మరో ఇద్దరితో కలిసి ప్లాను వేస్తాడు. ప్లాను సంపూర్ణంగా పనిచేస్తుండగా, రాజా ఆటోను ఢీకొట్టి చనిపోతాడు. యాదృచ్ఛికంగా, ఆటో డ్రైవర్ (అంబటి శ్రీనివాస్) పోసాని సోదరుడు మాణిక్ ( మహాత్ రాఘవేంద్ర ) ను తన వాహనంతో ఢీకొట్టిన డ్రైవరే.

చివరగా, సంజు తన డబ్బును దొంగిలించి, వారితో గొడవకు దిగిన వాళ్ళను కలుస్తాడు. కారులో అతడికి తన డబ్బూ ఒక గొలుసూ కనిపిస్తాయి. కారు వెనుక డిక్కీలో అమ్ము కూడా కనిపిస్తుంది. (రాజా ఆమెను తన కారులో దాచాడు). సంజు తన బావమరిదికి డబ్బు ఇస్తాడు. "కాలం రెండు రకాలు: మంచి, చెడు. జీవితంలో ప్రతి చెడు కాలం తరువాత మంచి కాలం వస్తుంది " అంటూ సినిమా ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సమీక్షలు

మార్చు

ది హిందూకు చెందిన వై.సునీతా చౌదరి ఈ చిత్రం బాగానే నడవవచ్చని భావించింది. [3] హన్స్ ఇండియా ఐదింట 3 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రం వినోదాత్మకంగా ఉంది, ఒకసారి చూడవచ్చు అని పేర్కొంది. [4] 123telugu.com ఈ చిత్రానికి ఐదింట 3 నక్షత్రాల నిచ్చింది. ఈ చిత్రం డిఫరెంట్ థ్రిల్లర్ అని పేర్కొంది. [5]

మూలాలు

మార్చు