రమా వైద్యనాథన్

భరతనాట్య కళాకారిణి, నాట్యగురువు

రమా వైద్యనాథన్ ఢిల్లీకి చెందిన భరతనాట్య కళాకారిణి.

రమావైద్యనాథన్

విశేషాలు మార్చు

ఈమె తల్లి మాధవి గోపాలకృష్ణన్ పండితురాలు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఈమె భరతనాట్యాన్ని యామినీ కృష్ణమూర్తి వద్ద అభ్యసించింది. ఈమెకు 19వ యేట వివాహం అయ్యింది. ఈమె అత్త సరోజా వైద్యనాథన్ పేరుపొందిన భరతనాట్య కళాకారిణి. వివాహం తరువాత ఈమె తన అత్త వద్ద భరతనాట్యంలో మెరుగులు దిద్దుకుంది. ఈమె ఢిల్లీలో "గణేశ నాట్యాలయ" అనే భరతనాట్య పాఠశాలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నది. ఈమె దేశంలోని అన్ని ప్రాంతాలలోను, విదేశాలలోను తన నృత్యప్రదర్శనలు ఇచ్చింది. [1][2][3][4]

2017లో కేంద్ర సంగీత నాటక అకాడమీ భరతనాట్యంలో ఈమె చేసిన కృషికి గుర్తింపుగా ఈమెకు అవార్డు ను ప్రకటించింది. [5] శ్రీకృష్ణగానసభ ఈమెకు "నృత్యచూడామణి" బిరుదును ఇచ్చింది.

ఈమె నృత్యదర్శకత్వం వహించిన నృత్య రూపకాలలో "వృక్షాంజలి", "శివోహమ్‌", "ద్విత" మొదలైనవి ఉన్నాయి.

ఈమె కుమార్తె దక్షిణ వైద్యనాథ బఘేల్ కూడా భరతనాట్య కళాకారిణి. మరొక కుమార్తె సన్నిధి మృదంగ వాద్య కళాకారిణి.

మూలాలు మార్చు

  1. Natascha Shah (9 June 2010). "Amazing grace". India Today. Retrieved 10 October 2016.
  2. Srikanth, Rupa (21 January 2016). "A blaze of energy". The Hindu (in Indian English). Retrieved 10 October 2016.
  3. Chitra Mahesh (21 December 2011). "'Chennai is intoxicating' - Times of India". The Times of India. Retrieved 10 October 2016.
  4. Malavika Vettath (25 March 2013). "Eastern rhythms at the Soorya India Festival | The National". The National. Retrieved 10 October 2016.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-01-19. Retrieved 2021-05-11.