సరోజా వైద్యనాథన్
సరోజా వైద్యనాథన్ (జ.1937) ఒక భరతనాట్య కళాకారిణి, నాట్యగురువు, నృత్యదర్శకులు.[1]
సరోజా వైద్యనాథన్ | |
---|---|
జననం | సరోజా ధర్మరాజన్ 1937 సెప్టెంబరు 19 |
జాతీయత | భారతీయురాలు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భరతనాట్యం |
పురస్కారాలు | పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు |
ఆరంభ జీవితం,విద్య
మార్చుఈమె 1937లో కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో జన్మించింది. ఈమె భరతనాట్యంలో శిక్షణను మొదట చెన్నైలోని "సరస్వతీ గాన నిలయం"లో తీసుకుంది. తరువాత తంజావూరుకు చెందిన కట్టుమన్నార్ ముత్తుకుమారన్ పిళ్ళై వద్ద శిక్షణను పొందింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో పి.సాంబమూర్తి పర్యవేక్షణలో కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఖైరాగఢ్ విశ్వవిద్యాలయం నుండి నాట్యంలో డి.లిట్ పట్టా పొందింది.[2]
వృత్తి
మార్చుఈమె వివాహం అయిన తరువాత నాట్య ప్రదర్శనలు ఇవ్వడం మానివేసి ఇంటి వద్ద పిల్లలకు నృత్యం నేర్పించసాగింది. 1972లో ఈమె భర్త ఢిల్లీకి బదిలీ కావడంతో అక్కడికి వెళ్ళి 1974లో "గణేశ నాట్యాలయ" అనే సంస్థను స్థాపించింది. ఈ శిక్షణా సంస్థ క్రమేపీ పెరిగి 1988లో స్వంత భవనాన్ని సమకూర్చుకుంది. ఈ సంస్థ ద్వారా శిష్యులకు ఈమె భరతనాట్యంతో పాటుగా తమిళ, హిందీ భాషలను, కర్ణాటక గాత్ర సంగీతాన్ని కూడా నేర్పించింది.[3]
ఈమె నృత్య దర్శకురాలు కూడా. ఈమె 10 పూర్తి నిడివిగల నృత్యరూపకాలను, 2000 భరతనాట్య అంశాలను రూపొందించింది.[3] 2002లో ఈమె ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయితో కలిసి ఆగ్నేయాసియా దేశాలలో పర్యటించి 2002 ASEAN సమ్మిట్‌కు హాజరైన సాంస్కృతిక బృందంలో పాల్గొన్నది.[1] ఈమె సుబ్రహ్మణ్య భారతి పాటలకు వ్యాఖ్యానాన్ని రచించి వాటికి నృత్య రూపాన్ని ఇచ్చింది.[1][4]
రచనలు
మార్చుఈమె భరతనాట్యం, కర్ణాటక సంగీతాలపై "ది క్లాసికల్ డాన్సస్ ఆఫ్ ఇండియా", "భరతనాట్యం - యాన్ ఇన్‌డెప్త్ స్టడీ", "కర్ణాటక సంగీతం", "ది సైన్స్ ఆఫ్ భరతనాట్యం" వంటి అనేక గ్రంథాలను రచించింది.[1][5]
కుటుంబం
మార్చుఈమె తల్లిదండ్రులు ఇరువురూ రచయితలు. ఈమె తల్లి కనకం ధర్మరాజన్ తమిళంలో డిటెక్టివ్ నవలలు రచించింది.[5] ఈమె బీహార్ కేడర్‌కు చెందిన ఐ.ఎ.ఎస్.అధికారి వైద్యనాథన్‌ను వివాహం చేసుకుంది.[3] ఈ జంటకు కామేష్ అనే కుమారుడు ఉన్నాడు. వీరి కోడలు రమా వైద్యనాథన్ అంతర్జాతీయ ఖ్యాతి గలిగిన భరతనాట్య నర్తకి. [6]
పురస్కారాలు
మార్చుఈమెకు భారత ప్రభుత్వం 2002లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులు లభించాయి.[7] ఈమెకు ఢిల్లీ ప్రభుత్వం సాహిత్య కళాపరిషత్ సన్మానాన్ని, తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం కళైమామణి పురస్కారాన్ని, కేంద్ర సంగీత నాటక అకాడమీ భరతనాట్యంలో అవార్డును[2] ప్రదానం చేశాయి. ఈమెకు 2006లో "భారత కళై సుదర్" అనే బిరుదు లభించింది.[8]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "ARTISTE'S PROFILE : Saroja Vaidyanathan". Centre for Cultural Resources and Training. Archived from the original on 15 ఏప్రిల్ 2013. Retrieved 28 జనవరి 2013.
- ↑ 2.0 2.1 "SAROJA VAIDYANATHAN Akademi Award: Bharatanatyam". Sangeet Natak Akademi. Archived from the original on 16 ఏప్రిల్ 2013. Retrieved 28 జనవరి 2013.
- ↑ 3.0 3.1 3.2 "ONE HUNDRED TAMILS OF THE 20TH CENTURY : Saroja Vaidyanathan". Archived from the original on 17 ఆగస్టు 2013. Retrieved 28 January 2013.
- ↑ "Adding poetry to dance". The Hindu. 6 July 2007. Archived from the original on 27 November 2007. Retrieved 28 January 2013.
- ↑ 5.0 5.1 "The write mudra". The Hindu. 19 February 2007. Archived from the original on 16 February 2013. Retrieved 28 January 2013.
- ↑ "Char Minar in the City of Qutb!". The Hindu. 26 December 2002. Archived from the original on 2 July 2003. Retrieved 28 January 2013.
- ↑ "Padma for Roddam, Dravid". Deccan Herald. 25 January 2013. Retrieved 28 January 2013.
- ↑ "Confluence of styles". The Hindu. 18 August 2006. Archived from the original on 6 August 2013. Retrieved 28 January 2013.