రవీందర్ కౌశిక్

భారతీయ వేగు

రవీందర్ కౌశిక్ (1952–1999) ప్రముఖ భారతీయ రహస్య ఏజెంటు. ఆయన మాజీ రా ఏజెంటు. పాకిస్థాన్ సైన్యానికి అనుకోకుండా దొరికిపోయి జైలుశిక్ష అనుభవించి జైలులో మరణించాడు[1][2][3][4].[5] ఇతనిని బ్లాక్ టైగర్ అని పిలుస్తారు.

రవీందర్ కౌశిక్

జీవిత విశేషాలు

మార్చు

రవీందర్ 1952 ఏప్రిల్ 11కర్నాల్, హర్యానాలో జన్మించారు. ఆయనకు నాటకాలలో ప్రవేశం ఉండేది. తన 23 వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW లో చేరారు. ఆ రోజులలో పాకిస్తాన్కు "అండర్ కవర్"గా వెళ్ళడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో నేను వెళ్ళతాను అని ముందుకు వచ్చాడు[1].

పాకిస్థాన్ లో

మార్చు

పాకిస్థాన్ వెళ్ళడం కోసం ఉర్ధూ నేర్చుకున్నాడు, మతం మార్చుకున్నాడు, వారి మతవిద్యను కూడా నేర్చుకొని అహమ్మద్ షాకీర్ అనే పేరుతొ 1975 లో పాకిస్థాన్ వెళ్ళాడు.[6] [7] పాకిస్థాన్ కు అనుమానం రాకుండా ఉండటానికి ముందుగా కరాచి యూనివర్శిటీలో LLB పూర్తిచేసి తరువాత పెద్ద హోదాలో పాకిస్తాన్ ఆర్మీలో చేరాడు[4]. ఇస్లాం మతం తీసుకున్నాడు.[8] స్థానికంగా ఉండే అమానత్ ను వివాహమాడాడు. 1979 నుండి 1983 వ సంవత్సరం వరకు అత్యంత విలువైన సమాచారాన్ని RAW, భారతీయ సైనిక దళాలకు పంపించేవాడు[5]. పాకిస్థాన్ దొంగ దెబ్బ తీయలనుకున్న ప్రతిసారి ముందగ సమాచారం ఇచ్చి కాపాడేవాడు. కాని దురదృష్ట వశాతూ మసిహ అనే మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వలన రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడు.

అప్పటి నుండి 16 సంవత్సరాలు ఇండియా రహస్యాలు చెప్పమని తీవ్రంగా హింసించారు. అయినప్పటికీ గొప్ప దేశభక్తుడైన ఈ వీరుడు ఒక్క రహస్యం కూడా బయట పెట్టలేదట. మన భారత ప్రభుత్వం ఎప్పటికైనా కాపాడుతుందని ఎదురు చూసి చూసి చివరికి క్షయ వ్యాధి సోకి 1999 జూలై 26 న మరణించారు[3]. అతనిని జైలు వెనుక భాగంలోనే ఖననం చేసారు[1]. ఇతనికి స్వయానా ఇందిరా గాంధీనే బ్లాక్ టైగర్ అని బిరుదునిచ్చింది.

ఆయన వ్రాసిన ఉత్తరాలలో ఒకదానిలో ఈ విధంగా వ్రాసారు,

"Kya Bharat jaise bade desh ke liye kurbani dene waalon ko yahi milta hai?" (Is this the reward a person gets for sacrificing his life for a great nation like India?)[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "India's forgotten spy - Agent's family fights an impossible battle". Retrieved 17 Aug 2012.
  2. "Ek Tha Tiger: Not Salman Khan, meet the real Indian Tiger!". Retrieved 17 Aug 2012.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 "Ek Tha Black Tiger: Real life tale of a true patriot". Archived from the original on 18 ఆగస్టు 2012. Retrieved 17 Aug 2012.
  4. 4.0 4.1 "Late spy's kin fight for reel life credit". Retrieved 17 Aug 2012.
  5. 5.0 5.1 "Story of a RAW agent spent his life in Pakistan". Archived from the original on 27 జూన్ 2015. Retrieved 10 Jun 2015.
  6. "Salman Khan's new movie in controversy again". Archived from the original on 2013-01-03. Retrieved 17 Aug 2012.
  7. "Dead RAW agent's nephew takes Salman's Ek Tha Tiger producers to court". Retrieved 17 Aug 2012.
  8. "The real life behind a 2002 spy thriller". Hindustan Times. 6 December 2009. Archived from the original on 18 మే 2015. Retrieved 15 May 2015.

ఇతర లింకులు

మార్చు