రష్మీ ఊర్ధ్వరేశే

రష్మీ ఊర్ధ్వరేశే (జననం: 1959) భారతీయ ఆటోమోటివ్ ఇంజనీర్

రష్మీ ఊర్ధ్వరేశే (జననం: 1959) భారతీయ ఆటోమోటివ్ ఇంజనీర్. ఈమె 2014 సంవత్సరం నుండి ‘ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ కి డైరెక్టర్‌గా ఉంది. 2020లో ఆటోమోటివ్ రంగంలో ఈమె చేసిన విశేష కృషికి గాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చే నారీశక్తి పురస్కారాన్ని అందుకుంది.[1]

రష్మీ ఊర్ధ్వరేశే
నారీశక్తి పురస్కారాన్ని అందుకుంటున్న రష్మీ ఊర్ధ్వరేశే
జననం
రష్మీ రనడే

1959
జాతీయతభారతీయురాలు
విద్యవిశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్‌పూర్
వృత్తిభారతీయ ఆటోమోటివ్ ఇంజనీర్
ఉద్యోగంఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నారీశక్తి పురస్కారం
జీవిత భాగస్వామిహేమంత్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రష్మీ ఊర్ధ్వరేశేకి నారీ శక్తి పురస్కారాన్ని అందజేస్తున్న దృశ్యం

వ్యక్తిగత జీవితం

మార్చు

రష్మీ ఊర్ధ్వరేశే 1959లో నాగ్‌పూర్ లో జన్మించింది.[1] 1977లో నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందింది. ఆ తర్వాత పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఆటోమోటివ్ ఇంజినీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[2]

వృత్తి జీవితం

మార్చు

ఆమె మొదట టెస్ట్ ఇంజిన్‌ల ఉద్గార నియంత్రణలను అభివృద్ధి చేయడంలో పనిచేసింది, ఆ తరువాత ఉద్గారాలను అధ్యయనం చేసే మొదటి భారతీయ ప్రయోగశాలలో ఉద్గారాలను కొలిచే పద్ధతులను అభివృద్ధి చేయడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. ఈమె ఆటోమోటివ్ భద్రత, ఉద్గారాలు, పరిసర వాయు నాణ్యత (AQM), ఈ-మొబిలిటీ, స్థిరమైన రవాణా (సస్టైనబుల్ ట్రాన్స్‌పోర్ట్), వెహికల్ రెగ్యులేషన్, హోమోలోగేషన్ మొదలైన వాటిలో నైపుణ్యం కలిగి ఉంది. రష్మీ ఊర్ధ్వరేశే ‘టోటల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’లో నిపుణురాలు. ఈ అంశంపై ఒక పుస్తకాన్ని కూడా రాసింది.[2] అంతేకాకుండా ఈమె సితార్ వాయించడం కూడా నేర్చుకుంది, సితార్ పోటీలలో విజేతగా కూడ నిలిచింది.[3] 2014లో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్‌గా ఎంపికైంది.

అవార్డులు

మార్చు
  • 35 సంవత్సరాలుగా ఆటోమోటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగంలో ఆమె చేసిన కృషికి గాను భారతదేశంలోని మహిళలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అయిన నారీశక్తి అవార్డుకు ఎంపికైంది.[4] ఈ అవార్డును 2020 మార్చిలో అప్పటి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చే అందుకుంది.
  • 2021: ఎక్సలెన్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అవార్డు[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 www.ETAuto.com. "Educating girls will bring significant changes in society: Rashmi Urdhwardeshe, ARAI Director – ET Auto". ETAuto.com. Retrieved 2020-04-04.
  2. 2.0 2.1 "36 years' efforts reached its zenith today: Nari Shakti award winner Rashmi Urdhwardeshe". The Indian Express. 2020-03-08. Retrieved 2020-04-04.
  3. "Women of Mettle – Rashmi Urdhwareshe, Director, ARAI". motorindiaonline.in. Retrieved 2020-07-13.
  4. "Educating Girls Will Bring Significant Changes In Society: Rashmi Urdhwardeshe". BW Education. Archived from the original on 2021-09-27. Retrieved 2020-04-04.
  5. "Mrs. Rashmi Urdhwareshe - SAEINDIA". SAEINDIA. Retrieved 2023-06-29.