నాగపూర్

మహారాష్ట్ర లోని ఒక పట్నం
(నాగ్‌పూర్ నుండి దారిమార్పు చెందింది)

నాగపూర్ (మరాఠీ: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం, మహారాష్ట్ర రెండవ రాజధాని. ఇది నాగపూర్ జిల్లా ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.[3] ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది.[4] ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. నాగపూర్ ను గోండు రాజు భక్త్ బులంద్ షా స్థాపించాడు . గోండులచే స్థాపించబడినా తరువాతి కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడింది. వీరు బ్రిటిష్ వాళ్ళకు లొంగి పోయారు.19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్, బేరార్ కు కేంద్రంగా చేసుకుంది.

  ?నాగపూర్
మహారాష్ట్ర • భారతదేశం
మారుపేరు: నారింజ నగరం
సున్నా మైలురాయి.
సున్నా మైలురాయి.
సున్నా మైలురాయి.
అక్షాంశరేఖాంశాలు: 21°05′N 79°02′E / 21.08°N 79.03°E / 21.08; 79.03
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
218 కి.మీ² (84 sq mi)
• 310 మీ (1,017 అడుగులు)
ప్రాంతం విదర్భ
జిల్లా (లు) నాగపూర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
24,20,000[1] (2006 నాటికి)
• 11,101/కి.మీ² (28,751/చ.మై)
అధికార భాష మరాఠి, హిందీ, ఆంగ్లం,గోండీ
మేయర్ మాయాతాయి ఇవనాతే
మునిసిపల్ కమిషనర్ సంజయ్ సేథీ
స్థాపన 18వ శతాబ్దం [2]
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 4400xx
• +91-712
• MH-31,MH-40
వెబ్‌సైటు: www.nagpur.nic.in
Seal of నాగపూర్
Seal of నాగపూర్

రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్రకు బొంబాయిని రాజధానిగా, నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు - పడమర ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 6 ఉత్తర - దక్షిణ ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 7 కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్.

ప్రముఖులు

మార్చు
  1. సుబ్రమణియం రామదొరై: భారత ప్రభుత్వ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ పై ప్రధానమంత్రి సలహాదారు.[5] 

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ""The world's largest cities"". City Mayors. Retrieved 2006-06-26.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-15. Retrieved 2008-08-18.
  3. ""Some 108 million people live in India's largest cities"". City Mayors.
  4. "Nagpur". Maharashtra Government.
  5. "S. Ramadorai" Archived 2011-03-07 at the Wayback Machine.

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నాగపూర్&oldid=4148865" నుండి వెలికితీశారు