రసాయన బంధం

(రసాయనిక బంధము నుండి దారిమార్పు చెందింది)

అణువు లోని రెండు పరమాణువుల మధ్య ఉన్న ఆకర్షణ బలాన్ని రసాయన బంధం అంటారు. పదార్థాలు ప్రకృతిలో రెండు రూపాల్లో లభిస్తాయి. ఒకటి పరమాణువుల రూపం. రెండోది సంయోగ పరమాణువుల రూపం.[1]

లూయీ చుక్క-పద్ధతిలో రసాయన బంధాలకు ఉదాహరణలు: కర్బనం C, హైడ్రోజన్ H, ఆక్సిజన్ O.

జడ వాయువులన్నీ పరమాణువుల రూపంలో లభిస్తాయి. ఉదాహరణకు, హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), జినాన్ (Xe), రేడాన్ (Rn). ఇవి రసాయనిక చర్యలలో పాల్గొనవు. అందువల్ల వీటిని మందకొడి వాయువులు అంటారు. సంయోగ పరమాణువులను తిరిగి రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒకటి మూలకాలు. రెండు సమ్మేళనాలు.

మూలకాల అణువులు ఒకే రకమైన పరమాణువులతో ఉంటాయి. ఉదాహరణకు H2, N2, O2, F2, Cl2, మొదలైనవి. సమ్మేళనాలు లేదా సంయోగ పదార్థాలు భిన్న పరమాణువులతో ఉంటాయి. ఉదాహరణకు HCl, H2O, CO2, NH3, CH4 మొదలైనవి.

జడవాయువులు ఏకపరమాణుకాలు. వాయు మూలకాలు ద్విపరమాణుకాలు. వజ్రం అనేక పరమాణువులతో నిర్మితమై ఉంటుంది కాబట్టి అది బహు పరమాణుకం.

రకాలు

మార్చు

అయానిక బంధం

మార్చు

ఎలక్ట్రాన్లు ఒక పరమాణువు నుంచి మరో పరమాణువుకు బదిలీ అయినప్పుడు ఏర్పడేది అయానిక బంధం.

అయానిక పదార్థాల ధర్మాలు

అయానిక సమ్మేళనాలు ఎక్కువగా ఘన స్థితిలో ఉంటాయి. ఇవి స్ఫటిక రూపంలో నిర్దిష్ట సంఖ్యలో అయాన్ల నిష్పత్తిలో ఉంటాయి.

సమయోజనీయ బంధం

మార్చు

"రెండు వేర్వేరు మూలకాలుకు చెందిన పరమణువులు తమ బాహ్యకక్షలోని ఒంటరి ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకున్నప్పుడు ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధం అంటారు." BeCl2, h20

సమన్వయ సమయోజనీయ బంధం

మార్చు

పంచుకున్న ఎలక్ట్రాన్ జంటను ఒక పరమాణువు మాత్రమే ఇచ్చినపుడు ఏర్పడేది సమన్వయ సమయోజనీయ బంధం.

మూలాలు

మార్చు
  1. ఈనాడు ప్రతిభ శుక్రవారం 18, సెప్టెంబర్ , 2009 న ప్రచురితమైన శీర్షిక ఆధారంగా...