వజ్రం (ఆంగ్లం: Diamond) (ప్రాచీన గ్రీకు భాష αδάμας – adámas "విడదీయలేనిది") ఒక ఖరీదైన నవరత్నాలలో ఒకటి. ఇది స్ఫటిక రూప ఘన పదార్థం. ఇది కర్బన రూపాంతరాలలో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే. ఈ కాఠిన్యం దీనీలో కల కర్బన పరమాణువుల ప్రత్యేక అమరిక వల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన కోరండం కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిదైనది.[1].దాని గట్టిదనం వల్లను, దానికి గల కాంతి పరావర్తన ధర్మం వల్లను ఇది అత్యంత ఖరీదైన రత్నముగా గుర్తింపబడింది. కొద్దిపాటి మలినాలైన బోరాన్, నత్రజని లను మినహాయిస్తే వజ్రం మొత్తం కర్బన పరమాణువులచే నిర్మితమై ఉంటుంది.[2]. మొట్ట మొదటి వజ్రాలు భారతదేశంలో,, బోర్నియాలో లభ్యమైనట్లు చరిత్ర చెపుతోంది.[3].చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. వీటిలో కోహినూర్ వజ్రం అత్యంత ప్రాధాన్యత కలిగినది. 1867లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడ్డ ఒక రాయి వజ్రంగా తేలడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదులలోనూ కొన్ని నేలల్లోనూ వీటికోసం వెదుకులాట ప్రారంభమైంది. బోత్స్వానా, నమీబియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాలు వజ్రాలను ఉత్పత్తి చేయడంలో ముందున్నాయి.

వజ్రం
Brillanten.jpg
వివిధ ఉపరితలాలు కలిగి కాంతులు విరజిమ్ముతున్న ఒక వజ్రం
సాధారణ సమాచారం
వర్గముNative Minerals
రసాయన ఫార్ములాC
ధృవీకరణ
పరమాణు భారం12.01 u
రంగుసాధారణంగా పసుపు పచ్చ, కపిల వర్ణం, లేదా వర్ణరహితం. అక్కడక్కడా నీలం, ఆకుపచ్చ, నలుపు, తెలుపు, గులాబీ రంగు, , ఎరుపు.
స్ఫటిక ఆకృతిఅష్ట ముఖి
స్ఫటిక వ్యవస్థIsometric-Hexoctahedral (Cubic)
చీలిక111 (perfect in four directions)
ఫ్రాక్చర్Conchoidal - step like
మోహ్స్‌ స్కేల్‌ కఠినత్వం10

లక్షణాలుసవరించు

  • దీని సాంద్రత 3.51 గ్రా/సెం.మీ3
  • దీని వక్రీభవన గుణకం 2.41
  • దీనిని ప్రయోగశాలలో తయారుచేయుట కష్టం
  • వజ్రము ఏ ద్రావణి లోనూ కరుగదు.
  • ఇది అథమ ఉష్ణ వాహకం., అథమ విద్యుద్వాహకం.
  • ఇది అమ్లాలతో గాని క్షారాలతో గాని ప్రభావితం కాదు.
  • దీనిని గాజును కోయటానికి ఉపయోగిస్తారు.

నిర్మాణంసవరించు

వజ్రంలో కార్బన్ పరమాణువులు చతుర్ముఖీయ నిర్మానములో ఏర్పాటై ఉన్నాయి. ఇందు ప్రతి పరమాణువు నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో సమయోజనీయ బంధము ద్వారా కలపబడియున్నది. దీన్ని అనేక మైన పంజరము వంటి నిర్మానములు గల స్థూల అణువుగా గుర్తించవచ్చు. ఈ నిర్మాణము పగలగొట్టడానికి కష్టతరమైనది, అత్యంత తక్కువ ఘనపరిమాణము కలది. C-C బంధ దూరము 1.54 A0 కాగా బంధ కోణం 1090 28'

సంస్కృతిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వజ్రం&oldid=3805714" నుండి వెలికితీశారు