రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్
(రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ (జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్) సికింద్రాబాదులోని మహాత్మాగాంధీ రోడ్డు ప్రాంతంలో ఉంది. 1877లో నిర్మించబడిన ఈ భవనం, 1998లో హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.[1][2]
రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | పోలీస్ స్టేషన్ |
ప్రదేశం | మహాత్మాగాంధీ రోడ్డు, సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం |
పూర్తి చేయబడినది | 1877 |
చరిత్ర
మార్చురాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ కు ఉన్న గడియారం 1900వ సంవత్సరంలో దవన్ బహదూర్ రాంగోపాల్ బహుకరించాడు.[3] 1998, మార్చి 23న వారసత్వ భవనంగా గుర్తించబడింది.
ఇతర వివరాలు
మార్చుఈ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ పోలీస్ పరధిలోకి వస్తుంది. హుస్సేన్ సాగర్ ప్రాంతం ఈ పోలీసు స్టేషన్ యొక్క అధికార పరిధిలోనే ఉంది.[4] ఈ భవనం శిథిలాపస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఈ భవనాన్ని కూల్చివేయాలని కోరింది.[5]
మూలాలు
మార్చు- ↑ The Hans India, Hyderabad (24 September 2016). "Landmark Ramgopalpet PS to be history". Retrieved 29 April 2019.
- ↑ The Hindu, Hyderabad (24 September 2016). "Ramgopalpet police station may be history". Retrieved 29 April 2019.
- ↑ "The Hindu : Metro Plus Hyderabad / Heritage : The man, his mite and Secunderabad". Archived from the original on 2008-09-29. Retrieved 2019-04-29.
- ↑ Hyderabad Lake Policing-Citizen's Charter Archived 20 ఆగస్టు 2008 at the Wayback Machine
- ↑ Nanisetti, Serish (2016-09-24). "Who moved my arch". Deccan Chronicle (in ఇంగ్లీష్). Hyderabad. Retrieved 29 April 2019.