రాంచీ జిల్లా
రాంచీ జిల్లా జార్ఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. జార్ఖండ్ రాష్ట్ర రాజధానీ నగరమైన రాంచీ, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఈ జిల్లా 1899 లో ఏర్పడింది. 2011 జనగణన ప్రకారం, జార్ఖండ్ లోని జిల్లాల్లో ఇది అత్యధిక జనాభా కలిగిన జిల్లా.[1]
రాంచీ జిల్లా | |
---|---|
దేశం | India |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | దక్షిణ ఛోటానాగ్‌పూర్ |
విస్తీర్ణం | |
• Total | 5,097 కి.మీ2 (1,968 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 29,14,253 |
• జనసాంద్రత | 572/కి.మీ2 (1,480/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-JH |
Website | http://ranchi.nic.in/ |
భౌగోళికం
మార్చుశీతోష్ణస్థితి
మార్చుRanchi | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో రాంచీ జిల్లా ఒకటి.[2] బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం (BRGF) నుండి నిధులు అందుకుంటున్న జార్ఖండ్‌లోని జిల్లాలలో ఇది ఒకటి.[2]
జనాభా వివరాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 4,77,249 | — |
1911 | 5,57,488 | +16.8% |
1921 | 5,36,346 | −3.8% |
1931 | 6,29,863 | +17.4% |
1941 | 6,73,376 | +6.9% |
1951 | 7,48,050 | +11.1% |
1961 | 8,94,921 | +19.6% |
1971 | 11,64,661 | +30.1% |
1981 | 14,89,303 | +27.9% |
1991 | 18,27,718 | +22.7% |
2001 | 23,50,245 | +28.6% |
2011 | 29,14,253 | +24.0% |
2011 జనాభా లెక్కల ప్రకారం రాంచీ జిల్లా జనాభా 29,14,253.[3] ఇది జమైకా దేశ జనాభాకు సమానం.[4] అమెరికా లోని అర్కాన్సాస్ రాష్ట్ర జనాభాకు సమానం.[5] జనాభా పరంగా భారతదేశపు జిల్లాల్లో 130 వ స్థానంలో ఉంది.[3] జనసాంద్రత 557/చ.కి.మీ.[3] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా పెరుగుదల రేటు 23.9%.[3] రాంచీలో లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 950 మంది స్త్రీలు.[3] జిల్లాలో అక్షరాస్యత 77.13%.[3]
రాంచీ జిల్లాలో షెడ్యూల్ కులాల జనాభా మొత్తం జనాభాలో 5.2% కాగా, షెడ్యూల్డ్ తెగల ప్రజలు 35.8% ఉన్నారు.
భాషలు
మార్చు2011 భారత జనగణన సమయంలో, జిల్లాలోని 30.23% జనాభా సాద్రి, 28.08% హిందీ, 11.88% కుర్మలి, 8.55% ఉర్దూ, 7.52% కురుఖ్, 4.79% సంతాలి, 4.70% ముండారి, 2.51% బెంగాలీ, 2.17 % భోజ్‌పురి, 1.17% మగహి తమ మొదటి భాషగా మాట్లాడుతారు.[6]
విద్య
మార్చురాంచీ జిల్లాలో అనేక ఉన్నత విద్యా సంస్థలున్నాయి. రాంచీ సగటు అక్షరాస్యత 77.13% (2011 జనాభా లెక్కల ప్రకారం). ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 85.63%, స్త్రీల అక్షరాస్యత 68.2%. రాంచీలో ఉన్న కొన్ని ప్రముఖ పాఠశాలలు లయోలా కాన్వెంట్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జవహర్ విద్యా మందిర్, కైరాలి స్కూల్, సెయింట్‌సేవియర్స్ స్కూల్, సెయింట్ థామస్ స్కూల్, బిషప్ వెస్ట్‌కాట్.
జిల్లాలో ఉన్న కొన్ని ఉన్నత విద్యా సంస్థలు:
- రాంచీ విశ్వవిద్యాలయం, 1960 లో స్థాపించారు. దాని అనుంబంధ కళాశాలైన రాంచీలోని సెయింట్ జేవియర్స్ కళాశాలను 1944 లో స్థాపించారు.
- రాంచీలోని మెస్రాలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1955 లో స్థాపించబడింది.
- రాంచీలోని బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని 1981 లో స్థాపించారు.
- ఐఐఎం రాంచీ, దేశంలో ఎనిమిదవ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంటు. 2010 లో రాంచీలో స్థాపించారు.
- నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా, రాంచీ భారతదేశంలోని పద్నాలుగో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం
- జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ (XISS), రాంచీలో 1955 సంవత్సరంలో యువ గ్రాడ్యుయేట్‌లకు సామాజిక పని నిర్వహణ కార్యక్రమాలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైంది.
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్‌మెంట్ అని పిలువబడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్‌మెంట్ (ISM) 1985 లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోని యువతకు మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ అందించాలనే ఆలోచనతో ఏర్పడింది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రీ & ఫోర్జ్ టెక్నాలజీ (NIFFT) తయారీ, మెటలర్జికల్, ఫౌండ్రీ, ఫోర్జ్ పరిశ్రమలకు నాణ్యమైన ఇంజనీర్లు, సుశిక్షితులైన నిపుణులను అందించడానికి UNDP-UNESCO సహకారంతో భారత ప్రభుత్వం 1966 లో ఏర్పాటు చేసింది.
- రాంచీ విశ్వవిద్యాలయానికి చెందిన రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS), 1960 లో స్థాపించబడింది.
- సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, రాంచీ వైద్య విద్యలో ఉన్నత స్థాయి అధ్యయనం అందించే ఒక సంస్థ. ఈ సంస్థ అన్ని వయసుల రోగులకు మనోరోగచికిత్స విభాగంగా కూడా పనిచేస్తుంది.
- జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ. దీన్ని 2009 లో ఇండియన్ పార్లమెంట్ చట్టం (2009 నం. 25) ద్వారా స్థాపించారు.
పరిపాలన
మార్చుబ్లాకులు
మార్చురాంచీ జిల్లాలో 18 బ్లాకులున్నాయి.[7] రాంచీ జిల్లాలోని బ్లాకుల జాబితా ఇది:
- అంగారా బ్లాక్
- బెరో బ్లాక్
- బుండు బ్లాక్
- బుర్ము బ్లాక్
- చాన్హో బ్లాక్
- కాంకే బ్లాక్
- ఓరంజి బ్లాక్
- ఇట్కి బ్లాక్
- నగ్రి బ్లాక్
- ఖేలారి బ్లాక్
- లాపుంగ్ బ్లాక్
- మందార్ బ్లాక్
- నామ్కుమ్ బ్లాక్
- రాతు బ్లాక్
- సిల్లీ బ్లాక్
- రహే బ్లాక్
- సోనాహతు బ్లాక్
- తమర్ బ్లాక్
మూలాలు
మార్చు23°00′N 85°00′E / 23.000°N 85.000°E23°00′N 85°00′E / 23.000°N 85.000°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 April 2012. Retrieved 27 September 2011.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011.
Jamaica 2,868,380 July 2011 est
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011.
Arkansas 2,915,918
- ↑ 2011 Census of India, Population By Mother Tongue
- ↑ http://www.mapsofindia.com/maps/jharkhand/tehsil/ranchi.html