రాంనగర్‌, హైదరాబాదు

రాంనగర్‌ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. నగరంలోని ప్రధాన నివాస ప్రాంతాల్లో ఒకటైన రాంనగర్, ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్.టి.టి. క్రాస్ రోడ్, ముషీరాబాద్ నివాస ప్రాంతానికి రెండు కిలోమీటర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రాంనగర్
సమీప ప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500020
Vehicle registrationటి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

వాణిజ్య ప్రాంతం సవరించు

ఇక్కడ నిత్యవసర వస్తువులు, వివిధ వస్తువులకు సంబంధించిన ప్రసిద్ధ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని నల్లకుంటలో చుక్కా రామయ్య ఐఐటీ అకాడమీ కూడా ఉంది.

రవాణా వ్యవస్థ సవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాంనగర్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[1] రాంనగర్ సమీపంలో జామియా ఉస్మానియా రైల్వే స్టేషను ఉంది.

ఇతర వివరాలు సవరించు

మట్టి గణపతే... మహా గణపతి అంటూ రాంనగర్‌ చౌరస్తాలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థలు పర్యావరణహిత ప్రతిమలు (వినాయకుడి విగ్రహాలు) ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.[2]

మూలాలు సవరించు

  1. నమస్తే తెలంగాణ (22 April 2018). "కొత్త రూట్ 6RK.. రాంనగర్ టూ కాళీమందిర్". Archived from the original on 17 September 2018. Retrieved 17 September 2018.
  2. ఆంధ్రజ్యోతి (12 September 2018). "మట్టి గణపతే.. మహా గణపతి". Archived from the original on 17 September 2018. Retrieved 17 September 2018.