రాఘవాపురం (రెడ్డిగూడెం మండలం)
రాఘవాపురం కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రాఘవాపురం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | రెడ్డిగూడెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అద్దేపల్లి జమలమ్మ |
పిన్ కోడ్ | 521215 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
మౌలిక వసతులు
మార్చుపాల ఉత్పత్తిదారుల సహకార సంఘం.
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
మార్చుశ్రీ సత్తిరెడ్డి సమేత పద్దమ్మ తల్లి ఆలయం
మార్చుఈ ఆలయంలో అమ్మవారి నవమ (తొమ్మిదవ) వార్షిక తిరునాళ్ళ మహోత్సవం, 2015,మార్చి-4, బుధవారం నుండి 8వ తేదీ ఆదివారం వరకు నిర్వహించారు. బుధవారం రాత్రి అంకసేవ, గురువారం సాయంత్రం నుండి ముత్యాలమ్మ తల్లికి ప్రసాద నివేదన, శుక్రవారం గ్రామసభ & ఊరేగింపు, శనివారం సాయంత్రం నుండి కుంకుమ బండ్లు, మొక్కుబడి ప్రభలు, ఆఖరి రోజు ఆదివారం నాడు, సిడిబండి మహోత్సవం (సిడిమాను తిప్పుట) మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద కోలాట బృందాల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి అలయంలోని అమ్మవారి దర్శించుకుని పూజలు చేసారు. [1]