రాఘవేంద్ర సింగ్ చౌహాన్

భారతీయ న్యాయమూర్తి.

రాఘవేంద్ర సింగ్ చౌహాన్ (జ. 24 డిసెంబరు 1959) భారతీయ న్యాయమూర్తి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు.[1] తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్[2] గా పనిచేశాడు.[3] రాజస్థాన్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొంతకాలం పనిచేశాడు.[4]

జస్టిస్
రాఘవేంద్ర సింగ్ చౌహాన్
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Assumed office
7 జనవరి 2021
Nominated byశరద్ అరవింద్ బొబ్డే
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
In office
22 జూన్ 2019 – 6 జనవరి 2021
Nominated byరంజన్ గొగోయ్
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్
In office
3 ఏప్రిల్ 2019 – 21 జూన్ 2019
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
అంతకు ముందు వారుటి.బి. రాధాకృష్ణన్
తెలంగాణ హైకోర్టు జడ్జి
In office
8 నవంబరు 2018 – 2 ఏప్రిల్ 2019
Nominated byరంజన్ గొగోయ్
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
In office
10 మార్చి 2015 – 7 నవంబరు 2018
Nominated byహెచ్.ఎల్. దత్తు
Appointed byప్రణబ్ ముఖర్జీ
రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి
In office
13 జూన్ 2005 – 9 మార్చి 2015
Nominated byరమేష్ చంద్ర లాహోటి
Appointed byఏ.పి.జె. అబ్దుల్ కలామ్
వ్యక్తిగత వివరాలు
జననం (1959-12-24) 1959 డిసెంబరు 24 (వయసు 64)

జననం, విద్య

మార్చు

రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 1959, డిసెంబరు 24న రాజస్థాన్ లో జన్మించాడు. బిఎ, ఎల్ఎల్.బి పూర్తిచేశాడు.

వృత్తి జీవితం

మార్చు

1983, నవంబరు 13న రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. క్రిమినల్, సేవా విషయాలు ఇతడి స్పెషలైజేషన్. 2005, జూన్ 13న రాజస్థాన్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. 2008, జనవరి 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. ఆ తరువాత 2015, మార్చి 10న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయబడ్డాడు. 2018, నవంబరు 8న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు. 2019, ఏప్రిల్ 3న తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యాడు. 2019, జూన్ 22న తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[5] 2020, డిసెంబరు 31న ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 2021, జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశాడు.[6]

మూలాలు

మార్చు
  1. "High Court bids adieu to CJ Chauhan". The Hindu (in Indian English). Special Correspondent. 2021-01-04. ISSN 0971-751X. Retrieved 2021-06-16.{{cite news}}: CS1 maint: others (link)
  2. "Raghvendra Singh Chauhan to take over as ACJ of Telangana HC". Bar & Bench. 2019-03-28. Retrieved 2021-06-16.
  3. "Telangana high court bids farewell to its first Chief Justice - Times of India". The Times of India. Retrieved 2021-06-16.
  4. Sakshi (20 June 2019). "హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌". Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.
  5. "Outgoing Telangana chief justice Raghvendra Singh Chauhan all praise for successor Hima Kohli". The New Indian Express. Retrieved 2021-06-16.
  6. Mishra, Ishita. "Telangana HC Chief Justice Raghvendra Singh Chauhan to take charge in Uttarakhand HC | Dehradun News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-16.{{cite web}}: CS1 maint: url-status (link)