రాఘవ్ లఖన్‌పాల్

రాఘవ్ లఖన్‌పాల్ (జననం 28 అక్టోబర్ 1974 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహారన్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాఘవ్ లఖన్‌పాల్
రాఘవ్ లఖన్‌పాల్


పదవీ కాలం
2014 – 2019
ముందు జగదీష్ సింగ్ రాణా
తరువాత హాజీ ఫజ్లూర్ రెహమాన్
నియోజకవర్గం సహారన్‌పూర్

ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2012 – 2014
ముందు నియోజకవర్గం ఏర్పాటు చేశారు
నియోజకవర్గం సహారన్‌పూర్ నగర్
పదవీ కాలం
2007 – 2012
ముందు సంజయ్ గార్గ్
తరువాత జగ్‌పాల్
నియోజకవర్గం సహారన్‌పూర్
పదవీ కాలం
2001 – 2002
ముందు నిర్భయ్ పాల్ శర్మ
తరువాత ధరమ్ సింగ్ సైనీ
నియోజకవర్గం సర్సావా

వ్యక్తిగత వివరాలు

జననం (1974-10-28) 1974 అక్టోబరు 28 (వయసు 50)
సహారన్‌పూర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నిర్భయ్ పాల్ శర్మ
నివాసం సహారన్‌పూర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
పూర్వ విద్యార్థి ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ
[1]

రాజకీయ జీవితం

మార్చు

రాఘవ్ లఖన్‌పాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2001 నుండి 2014 వరకు సహరాన్‌పూర్, [సహరన్‌పూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం|సహరన్‌పూర్ నగర్]] నియోజకవర్గల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహారన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ పై ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం & పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, లోక్‌సభ సభ్యులకు కంప్యూటర్లను అందించడంపై కమిటీ సభ్యుడిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ICWA) సభ్యుడిగా పని చేశాడు.

రాఘవ్ లఖన్‌పాల్ 2014 & 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహారన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

మార్చు
  1. Zee News (15 May 2019). "Saharanpur Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  2. The Indian Express (23 December 2017). "BJP MPs' formula: If more than two kids, deny benefits to parents or a generation" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.