సరస్వతీ మహల్ గ్రంథాలయం
సరస్వతి గ్రంథాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఉన్న పురాతన గ్రంథాలయం. ఇందులో సంస్కృతం, తమిళ, తెలుగు, హిందీ, మరాఠీ, ఇతర భారతీయ భాషల్లో ఉన్న పురాతన తాళపత్ర గ్రంథాల నుంచి అనేక పుస్తకాలు ఉన్నాయి.[1]
చరిత్ర
మార్చుతంజావూరు చెన్నై నగరానికి 279 కి.మీ దూరంలో ఉంది. మధ్య చాళుక్యులు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. సా. శ 1535 - 1673 మధ్య కాలంలో నాయకర్లు తంజావూరును పరిపాలించారు. ఈ గ్రంథాలయం 1777 - 1832 మధ్య కాలంలో జీవించిన తంజావూరు మహారాజు సెర్ఫోజీ II వారసత్వంగా పరిగణించబడుతోంది. ఈయన నాయకర్ల కాలంలో ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని మరింతగా అభివృద్ధి చేశాడు. ఈయనను మీసు కృష్ణ అయ్యర్ అనే గాయకుడు తాను స్వరపరిచిన ఒక కృతిలో సరస్వతీ నిలయ స్థాపక అని కీర్తించాడు.[2] ఈయన కాలంలోనే తంజావూరు చిత్రకళ, భరతనాట్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.[3]
పుస్తకాలు
మార్చుఈ గ్రంథాలయంలో తమిళ, తెలుగు, హిందీ, మరాఠీ మొదలైన భారతీయ భాషల్లోని అరుదైన తాళపత్ర గ్రంథాలు, ప్రతులు భద్రపరచబడి ఉన్నాయి. 20 వ శతాబ్దం మొదటి భాగంలో మరాఠీ ప్రతులు రాయడానికి మోడీ అనే లిపి వాడేవారు. అరుదైన ఈ లిపిలో ఉన్న 12000 పత్రాలు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న గ్రంథాలు ఎక్కువగా వ్యాకరణ, వైద్య శాస్త్రాలకు సంబంధించినవి.
మూలాలు
మార్చు- ↑ "సరస్వతి గ్రంథాలయం". sarasvatimahal.in. Archived from the original on 7 ఫిబ్రవరి 2018. Retrieved 15 February 2018.
- ↑ భోస్లే, ప్రతాప్ సింగ్ సెర్ఫోజీ రాజే. Contributions of Thanjavur Maratha Kings (Second ed.). చెన్నై: నోషన్ ప్రెస్. ISBN 9781948230957. Retrieved 21 February 2018.
- ↑ "The Great Library of Tanjore". livehistoryindia.com. Retrieved 16 February 2018.[permanent dead link]