రాజపుత్ర రహస్యం
రాజపుత్ర రహస్యం 1978 లో విడుదలైన తెలుగు సినిమా. జయలక్ష్మి మూవీల్ బ్యనర్ పై యార్లగడ్డ లక్ష్మీ చౌదరి, సి.ఎస్.రాజులు నిర్మించిన ఈ సినిమాకు యస్.డి.లాల్ దర్శకత్వం వహించాడు. అడవి రాముడు చిత్రం విజయవంతమయ్యాక, ఎన్.టి.ఆర్., జయప్రద జంటతో అడవి నేపథ్యంతో ఈ చిత్రం తీశారు. ఎన్.టి.ఆర్ టార్జాన్ అహార్యంతో చిత్రంలో కనిపిస్తారు.[1]
రాజపుత్ర రహస్యం (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యస్.డి.లాల్ |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జయప్రద |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | జయలక్ష్మి మూవీస్ |
భాష | తెలుగు |
చిత్రకథ
మార్చుబాలయ్య కొడుకు, యువరాజును జమున అడ్డు తొలగించుకునే ప్రయత్నిస్తే ఆ బాలుడు అడవికి చేరి అక్కడ జంతువులతో పెరుగుతాడు. తర్వాత రాకుమారి జయప్రద అడవికి వచ్చిననప్పుడు మూగగా ఉన్న రామారావును కలుస్తుంది. అతనిని నగరానికి తెచ్చి సంస్కరిస్తుంది. తర్వాత రామారావు రాజపుత్ర రహస్యాని ఛేదించడం చిత్రకథ.
తారాగణం
మార్చు- నందమూరి తారక రామారావు
- జమున
- జయప్రద
- కాంచన
- కైకాల సత్యనారాయణ
- బాలయ్య మన్నవ
- అల్లు రామలింగయ్య
- ధూళిపాల
- ఎం.మోహన్‌బాబు
- మిక్కిలినేని
- రాజనాల
- త్యాగరాజు
- జగ్గారావు
- సీతారాం
- ఆనంద్ మోహన్
- చలపతి రావు
- సత్యం
- కాశీనాథ తాత
- చంద్రరాజు
- మాస్టర్ రాము
- పుష్పలత
- విజయవాణి
- జయమాలిని
- పద్మా ఖన్నా
పాటలు
మార్చు- ఓపలేని తీపి ఇది ఓయమ్మా, రచన. సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల
- సిరిమల్లె పువ్వు కింద సీతాకోక చిలకా, రచన.వేటూరి సుందర రామమూర్తి,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- చానాళ్ళకొచ్చాడు చందురూడు, ఎన్నెల్లే తెచ్చాడు అందగాడు, రచన. వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ జానకి
- ఎంత సరసుడు , రచన.సి.నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- దిక్కులేని దాటాడి, రచన.వేటూరి సుందర రామమూర్తి గానం.పి సుశీల, ఎస్ జానకి.
- హే జగన్మాతా హే పరాశక్తి సర్వ సర్వం సహ చక్ర సంవర్థిని, గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం .
సాంకేతిక వర్గం
మార్చు1.దర్శకుడు: ఎస్.డి.లాల్
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాతలు: వై లక్ష్మయ్య చౌదరి , సి.ఎస్.రాజు
నిర్మాణ సంస్థ: జయలక్ష్మి మూవీస్
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, సి నారాయణ రెడ్డి
నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి
సమర్పణ: వై.నాయుడమ్మ .
మూలాలు
మార్చు- ↑ "Rajaputhra Rahasyamu (1978)". Indiancine.ma. Retrieved 2020-09-17.