అడవి రాముడు

1977 సినిమా

ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్ - కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. ఇది సత్యచిత్ర వారి మూడవ చిత్రం (గతంలో ఈ సంస్థ ద్వారా తాసిల్దార్ గారి అమ్మాయి, ప్రేమబంధం చిత్రాలు నిర్మితమయ్యాయి). జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం. తెలుగు సినిమాలలో కథ, కథనం, సంగీతం, స్టెప్పులు ఈ చిత్రం మొదలు పెట్టిన ఒరవడిలో చాలాకాలం సాగాయి.

అడవి రాముడు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం సత్యనారాయణ,
సూర్యనారాయణ
కథ జంధ్యాల
తారాగణం నందమూరి తారక రామారావు,
జయప్రద,
జయసుధ
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ సత్యచిత్ర
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీ నటులు

మార్చు

చిత్రకథ

మార్చు

అటవీ ప్రాతంలో నాగభూషణం, కొడుకు సత్యనారాయణతో కలిసి కలప స్మగ్లింగు, అక్రమ జంతు రవాణా వంటి వ్యాపారాలు చేస్తూ అక్కడి ప్రజల్ని దోపిడీ చేస్తుంటాడు. రాము (రాముడు, ఎన్.టి.ఆర్) ప్రజల పక్షాన నాగభూషణాన్ని ఎదుర్కుంటాడు. అక్కడి ప్రజలలో చైతన్యం తెస్తాడు. అటవీ శాఖాధికారి కూతురు జయప్రద అతన్ని ప్రేమిస్తుంది. అక్కడి గూడెంలో ఉండే యువతి (జయసుధ) రామూను అన్నగా ప్రేమిస్తుంది. మొదట అపార్ధం చేసుకున్న జయప్రద తర్వాత నిజం తెలుసుకుంటుంది. రాము అడవిలో ఉంటే తమకు ఇబ్బంది అని నాగభూషణం బృందం రాము అడవి నుంచి పంపించి వేయటానికి గూడెంలోఉన్న శ్రీధర్ ను వాడుకుంటారు. ఐతె రాము అక్కడి విషయాలు తెలుసుకోవడానికి మామూలు వ్యక్తిగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసరని వారెవరికి తెలియదు. చిత్రం రెండవ సగంలో కథ రాము ఫ్లాష్ బాక్, ఇంకా విలన్ల ఆట కట్టించడం.

చిత్ర కథనం

మార్చు

కన్నడ రాజ్ కుమార్ నటంచిన గంధద గుడి చిత్రం ఈ చిత్రానికి కొంత ఆధారం. అప్పటి వరకు ఉన్న రామారావు ఇమేజిని మారుస్తూ, ఆహార్యం, దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త రామారావును చూపించారు. తొలిసారిగా విజయవాడ యాక్స్ టైలర్స్ రామారావు దుస్తులు రూపకల్పన చేసారు. రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోఇజమ్ ప్రదర్శితమౌతూ వస్తుంది. అప్పటి సూపర్ హిట్ హిందీ చిత్రం షోలే లోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు. రోహిణిని విలన్ల చంపడం, రామును గూడెం నుండి వెళ్ళిపొమ్మని శ్రీధర్ బెదిరించే సన్నివేశం, కాకరాల రామారావును అక్కడే ఉండమనడం, జయప్రద రాము కోసం గుడిలో ప్రార్ధించడం, జయసుధ వెనకనుండి మాట్లాడటం, జయసుధ, జయప్రదలను గుర్రపు బండిమీద సత్యనారాయణ వెంటాడటం షోలే నుండి తీసుకున్నవే.

పాటలు

మార్చు

చిత్రంలో పాటలన్నీ జనరంజకమైనవే. వేటూరి ఈ చిత్రంలో అన్ని పాటలూ వ్రాసారు. ఈ సినిమాలో పాటలు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ది పొందాయి . ఈ సినిమాలో పాటలు చాలా కాలం ఇవి వూరూరా మారు మ్రోగాయి.

 • మనిషైపుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ - (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోరస్)
 • అమ్మతోడూ అబ్బతోడూ నీ తోడూ నాతోడూ - (పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
 • ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ ఎన్నెల్లే తిరిగొచ్చే మాకళ్ళకూ - (పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
 • ఆరేసుకోబోయి పారేసుకున్నాను - (పి.సుశీల, ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం)
 • కుకుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి - (పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
 • చూడర చూడర చూడర ఒక చూపూ ఓ సులెమాన్ మియా - (పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)

విశేషాలు

మార్చు
 • కన్నడ చిత్రం "గంధద గుడి"తో ఈ సినిమా కథకు పోలికలున్నాయి.
 • ఇది గొప్ప విజయం సాధించిన చిత్రం. కోటి రూపాయలు వసూలు చేసిన మూడవ తెలుగు సినిమా ఇది.[1]
 • ఇది 32 కేంద్రాలలో 100రోజులు ఆడింది. 16 కేంద్రాలో 175 రోజులు, 8 కేంద్రాలలో 200 రోజులు, 4 కేంద్రాలలో 365 రోజులు ఆడింది.[1][2]

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-13. Retrieved 2008-08-27.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-11-22. Retrieved 2008-08-27.