రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్) (Central University of Rajasthan) అనేది భారతదేశంలోని రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్న ఒక కేంద్ర విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయమునకు చెందిన పది పాఠశాలలు, ఇరవై విద్యా విభాగాలు, ఒక కమ్యూనిటీ కళాశాలలో టెక్నాలజీ, సైన్స్, హ్యుమానిటీస్, కామర్స్, మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసీ, సోషల్ సైన్స్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి, ఇవి శాస్త్రీయ, సాంకేతిక, సామాజిక విద్యతో పాటు పరిశోధనలకు బలమైన ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం విద్యార్థుల నమోదు 1700 దాటింది, 23 కి పైగా రాష్ట్రాల విద్యార్థులను కలిగి ఉంది.
నినాదం | మీ అధ్యయనం తెలివైనదిగా, ప్రభావవంతమైనదిగా ఉండనివ్వండి |
---|---|
ఆంగ్లంలో నినాదం | May our study be brilliant and effective |
రకం | కేంద్ర విశ్వవిద్యాలయం |
స్థాపితం | 2009[1] |
ఛాన్సలర్ | కృష్ణస్వామి కస్తూరిరంగన్[2] |
వైస్ ఛాన్సలర్ | అరుణ్ కె. పూజారి[3] |
విద్యార్థులు | 1700[4] (మే 2015 లో) |
స్థానం | బందర్ సింద్రీ, అజ్మీర్, రాజస్థాన్, భారతదేశం 26°37′39″N 75°01′54″E / 26.627392°N 75.031672°E |
కాంపస్ | గ్రామీణ |
అనుబంధాలు | యుజిసి, ఎఐయు |
చరిత్ర
మార్చురాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పార్లమెంట్ చట్టం ద్వారా 3 మార్చి 2009 న కేంద్ర విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది.[1] ఈ విశ్వవిద్యాలయం 2009-10లో M.Sc./M.A అనే రెండు పిజి ప్రోగ్రామ్‌లతో ప్రారంభించబడింది.
డాక్టోరల్, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములు 2013-14లో ప్రారంభించబడ్డాయి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Central Universities Act 2009" (PDF). Ministry of Human Resource Development website.
- ↑ "Chancellor". www.curaj.ac.in. Retrieved 3 May 2018.
- ↑ "Vice Chancellor". Central University of Rajasthan website.
- ↑ "Central University of Rajasthan Self Study Report Part 1" (PDF). Central University of Rajasthan website.