రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
వత్సవాయ ముసలి తిమ్మ జగపతి గారు పెద్దాపురం సంస్థాన సంపాదకులు, వీరు తొలుత రెడ్దిరాజులకు సరదారుగా ఉండి తన పరాక్రమముచేత పెద్దాపురం సంస్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన తండ్రి శ్రీ వత్సవాయి పేర రాజు గారు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ గారు.
తిమ్మరాజు గారి పాలనా కాలం పదునాల్గవ శతాబ్దం ఉత్తరార్ధం (1555-1607) గుణవంతుడైన ఏనుగు గుర్వ మంత్రి, పరాక్రముడైన పోలాప్రడ సూర మంత్రిలను రెండు భుజాలుగా కలిగి ఉండడం చేత శ్రీ రాజా వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారుగా పేరు పొందడం జరిగింది. ఆయన పరిసర ప్రాంతాలలో ఉన్న పాలకులు అందరినీ ఓడించి రాజ్యమును విస్తరింప చేసి పెద్దాపురంలో 18 బురుజుల ఒక కోటను నిర్మించి అందులో ఒక బురుజులో నరసింహస్వామిని ప్రతిష్ఠించారు. ఈ అయన పరాక్రమం గురించి దానగుణం గురించి అనేక పద్యాలు వ్రాయబడినాయి, అనేక గ్రంథాలలో ఈయన ప్రస్తావన వుంది శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చిన్న కదలు అందులో ముఖ్యమైనవి.
'తిమ్మరాజ శిఖామణి తేజరిల్లె
నతని కీర్తి నటించు శీతాద్రిసేతు
మధ్య పృధ్వీశ్వరాస్థాన మంటపములు'
- రామ విలాసము, అవతారిక, పు. 21.
ఆనాటి సుబేదారైన షేర్ మొహమ్మద్ ఖాన్ చతుర్బుజ తిమ్మ రాయ జగపతి బహద్దరు గారి యొక్క వీరోచిత కార్యాలను మెచ్చి ఒక కత్తిని బహుమానంగా ఇచ్చాడట.
</poem>' షేరు మొహమ్మదు క్షీతిప శేఖరుఁ డద్భుత శౌర్య ధైర్య దు ర్వారుఁడు మెచ్చి పైడిఁయొఱవాల్దన కేల నొసంగు వేళ దై త్యారిసమానమూర్తి తన హస్తము మీఁ దుగ నందె వార్దిగం భీరుఁడు వత్సవాయికుల పేరయ తిమ్మనృపాలుడుఁన్నతిన్’ - పైది, పు. 23.</poem>
విజయ నగర మహారాజు శ్రీ విజయరామరాజు గారు వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారి వీరత్వాన్ని వర్ణిస్తూ రచించిన చాటువు </poem>ఆంభోజం కలయం సదృక్ష మవనే సాహిత్యరీత్యామ్ దృశో ర్మాంధా తార మపార సంపది మహా బావే యశో రాశిషు శత్రూణాం పురభంజనే ధృతి గుణేకిం చోరగేంద్రంమతి ప్రాగాల్భ్యే ప్రతిధాతి తిమ్మ నృపతిః పాకాహిత ప్రాభవః - విజయరామరాజు చాటువు</poem>