రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం

రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం (సాధారణంతా RGESS అని పిలుస్తారు) 2012-13 భారత దేశ బడ్జెట్ లో ప్రవేశపెట్టబడిన ఆదాయపు పన్ను పొదుపు పథకం.[1] ఇది ప్రజల పొదుపును అధిక రాబడిని ఇచ్చే ఈక్విటీ మార్కెట్ లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవిధంగా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టబడింది. ఈ స్కీంను భారత ఆరవ ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ పేరుతో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం 2012 సెప్టెంబరు 21 న ప్రవేశపెట్టిరి.[2] ఈ పథకం కింద స్టాక్ మార్కెట్లో (గుర్తింపబడిన షేర్లలో) మొదటిసారి పెట్టుబడి పెట్టేవారు సెక్షన్ 80CCG కింద గరిష్ఠంగా రూ. 25,000/- వరకు పన్ను ఆదాయాన్ని తగ్గించి చుపుకోవచ్చు. ఈ పథకం కింద మినహాయింపు కోసం గరిష్ఠ వార్షిక ఆదయము రూ. 12,00,000/- దాటకూడదు. పెట్టుబడి పెట్టిన షేర్లలో లాకిన్ పీరియడ్ 3 సంవత్సరాలుగా ఉంటుంది. ఎంత పెట్టుబడిపెడితే అంత మొత్తంలో సగం మొత్తానికి ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. గరిష్ఠంగా రూ. 50,000/- పెట్టుబడిపై గరిష్ఠంగా రూ.25,000/- ఆదాయంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.[3]

మూలాలు మార్చు

  1. "2012-2013 Union Budget, India" (PDF). Archived from the original (PDF) on 2013-10-07. Retrieved 2013-02-22.
  2. "Chidambaram clears Rajiv Gandhi Equity Savings Scheme; MFs, ETFs allowed". Businesstoday.intoday.in. 2012-09-21. Retrieved 2013-02-22.
  3. "80CCG 23rd November 2012, Government of India" (PDF). Archived from the original (PDF) on 2013-01-23. Retrieved 2013-02-22.

ఇతర లింకులు మార్చు