రాజేష్ యాదవ్
నందలాల్ రాజేశ్ యాదవ్ (జననం 20 ఫిబ్రవరి 1965) హైదరాబాదు క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారతీయ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. పదవీ విరమణ తరువాత క్రికెట్ టీమ్ కు కోచ్ గా నియమించబడ్డాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నందలాల్ రాజేశ్ యాదవ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1965 ఫిబ్రవరి 20|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతివాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | శివలాల్ యాదవ్ (అన్న), అర్జున్ యాదవ్ | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1984/85–1993/94 | హైదరాబాదు క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ఇఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో, 2016 ఫిబ్రవరి 27 |
జననం
మార్చురాజేశ్ యాదవ్ 1965, ఫిబ్రవరి 20న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.
క్రీడారంగం
మార్చుకుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలరైన రాజేశ్ యాదవ్ 60 ఫస్ట్ క్లాస్, 6 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. 1984/85 నుండి 10 సీజన్లపాటు ఇతడి కెరీర్ కొనసాగింది. ఆ సమయంలో హైదరాబాద్, సౌత్ జోన్, విల్స్ XI కు ప్రాతినిధ్యం వహించాడు. 1984 డిసెంబరులో 19 సంవత్సరాల వయసులో ఆంధ్రా జట్టుపై ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన రాజేశ్ యాదవ్, ఆ మ్యాచ్‌లో 4/65, 7/64 లను చేశాడు.[1] 1986–87 రంజీ ట్రోఫీని గెలుచుకున్న హైదరాబాదు జట్టులో రాజేశ్ యాదవ్ కూడా ఉన్నాడు. ఫైనల్‌లో ఢిల్లీపై ఐదు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో హైదరాబాదు జట్టు గెలిచింది.[2] ఆ సీజన్ తరువాత విల్స్ ట్రోఫీలో విల్స్ XI కొరకు ఆడాడు, 1987 క్రికెట్ ప్రపంచ కప్ కొరకు ఆటలో పేరు పొందాడు.[3] 1993 డిసెంబరులో 30.20 సగటుతో 159 వికెట్లతో యాదవ్ తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ముగించాడు. ఇందులో ఏడు ఐదు వికెట్లు, రెండు పది వికెట్లు ఉన్నాయి.[4]
యాదవ్ పదవీ విరమణ తర్వాత క్రికెట్ కోచ్ అయ్యాడు. 2000లలో హైదరాబాదు జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.[5] హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) శాటిలైట్ అకాడమీలో కోచ్‌గా పనిచేశాడు, యువ ఫాస్ట్ బౌలర్లకు హైదరాబాదు జింఖానా క్రికెట్ స్టేడియంలో శిక్షణ ఇచ్చాడు.[6] మ్యాచ్ రిఫరీగా అనేక మ్యాచ్‌లలో అధికారికంగా వ్యవహరించిన రాజేశ్ యాదవ్,[7] హెచ్‌సిఎకు సెలెక్టర్‌గా కూడా పనిచేశాడు.[3]
వ్యక్తిగత జీవితం
మార్చుయాదవ్ అన్న శివలాల్ యాదవ్ కూడా క్రికెటర్. భారతదేశం తరపున టెస్ట్, వన్డే క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. తరువాత హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశాడు. శివలాల్ కుమారుడు అర్జున్ యాదవ్ కూడా హైదరాబాద్, సౌత్ జోన్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. రాజేశ్ కుమారుడు యువరాజ్ యాదవ్ కూడా క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[5][8]
మూలాలు
మార్చు- ↑ "Andhra v Hyderabad in 1984/85". CricketArchive. Retrieved 2021-07-21.
- ↑ "Delhi v Hyderabad in 1986/87". CricketArchive. Retrieved 2021-07-21.
- ↑ 3.0 3.1 Dhar, Deba Prasad (2014-03-29). "Why new BCCI chief Yadav hardly looks the part". Mumbai Mirror. Retrieved 2021-07-21.
- ↑ "Rajesh Yadav". CricketArchive. Retrieved 2021-07-21.
- ↑ 5.0 5.1 Subrahmanyam, V V (2006-02-16). "This `son rise' eclipses merit `Son stroke' hits Hyderabad cricket". The Hindu. Retrieved 2021-07-21.
- ↑ Subrahmanyam, V V (2012-05-03). "The good ol' days". The Hindu. Retrieved 2021-07-21.
- ↑ "Lists of matches and detailed statistics for Rajesh Yadav". CricketArchive. Retrieved 2021-07-21.
- ↑ "Yuvraj Yadav". CricketArchive. Retrieved 2021-07-21.
బయటి లింకులు
మార్చు- క్రిక్ఇన్ఫో లో రాజేష్ యాదవ్ ప్రొఫైల్
- క్రికెట్ ఆర్కివ్ లో రాజేష్ యాదవ్ వివరాలు