రాజ యోగము
రాజ యోగము అనేది సంస్కృత గ్రంథాల్లో పేర్కొన్న యోగా లక్ష్యం, ఇంకా దాన్ని చేరుకునే పద్ధతి. ఆధునిక యుగంలో 19వ శతాబ్దంలో స్వామి వివేకానంద రాసిన రాజ యోగ అనే పుస్తకంలో పతంజలి యోగసూత్రాలకు రాసిన తనదైన భాష్యంతో యోగాను ఆచరించడం కూడా ఈ పేరుతో పిలవబడుతుంది.[1] అప్పటి నుంచీ దీన్ని అష్టాంగ యోగ, సహజ యోగా లాంటి వేర్వేరు పేర్లతో పిలవబడుతోంది.[2]
పద వ్యుత్పత్తి
మార్చురాజ అనే పదానికి ఉత్తమమైనది, ముఖ్యమైనది అని అర్థం ఉంది.[3] రాజ యోగ ఉంటే యోగములలో ఉత్తమమైనది అని అర్థం చెప్పుకోవచ్చు. చారిత్రకంగా రాజ యోగ అనే పదాన్ని ఆధునిక అర్థానికి భిన్నంగా వేరే సందర్భాల్లో కూడా వాడారు. పురాతన, మధ్యయుగపు గ్రంథాల ప్రకారం రాజ యోగం అంటే యోగా ద్వారా చేరుకునే అత్యున్నత స్థితి (సమాధి). హఠయోగ ప్రదీపిక, రాజ యోగాన్ని చేరుకోవడానికి హఠయోగం అత్యున్నతమైన పద్ధతి అని పేర్కొంటుంది.
రాజయోగాన్ని గురించి యోగతత్వ ఉపనిషత్తులో ఉంది.[4]
చరిత్ర
మార్చుసా.శ 12 వ శతాబ్దానికి చెందిన శైవ యోగ పాఠ్య గ్రంథం అమనస్కలో వామదేవుడికీ, శివుడికీ జరిగే సంభాషణ ఉంటుంది. రెండవ అధ్యాయంలో రాజ యోగాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది. దీని సారాంశం ప్రకారం దాని పేరును బట్టే యోగా ద్వారా తనకు తానే ఒక రాజుగా, అత్యున్నత స్థాయికి చేరుకోగలడు.[5] రాజయోగం లక్ష్యం కలతలేని ఆనందం, సహజమైన ప్రశాంతత, సంతృప్తి తప్ప మరేమీ అనుభవించకపోవడం.
మూలాలు
మార్చు- ↑ Swami Vivekananda, Raja Yoga, ISBN 978-1500746940
- ↑ "World's largest meditation centre coming up in Hyderabad". 24 January 2020.
- ↑ rAja Monier-Williams' Sanskrit-English Dictionary, Cologne Digital Sanskrit Lexicon, Germany
- ↑ Ayyangar, TR Srinivasa (1938). The Yoga Upanishads. The Adyar Library. p. 301.
- ↑ Jason Birch (2013), The Amanaska: King of All Yogas, Ph.D. Dissertation, Oxford University