రాణి అబ్బక్క
రాణి అబ్బక్క చౌతా ఉళ్ళాల రాజ్యానికి రాణి. 16వ శతాబ్దంలో పోర్చుగల్ వాళ్ళతో పోరాడారు ఆమె. చౌతా వంశానికి చెందిన అబ్బక్క కర్ణాటకలోని మంగళూరు ప్రాంతాన్ని పరిపాలించారు. ఆమె వంశస్థులు ఈ ప్రాంతాన్ని చాలా ఏళ్ళ నుంచీ పాలిస్తున్నారు. వీరి రాజధాని పుట్టిగె. ఉళ్ళాల రాజ్యంలో ఉన్న రేవు పట్టణం దానికి ఇంకో రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రాముఖ్యత ఉండటంతో ఎన్నోసార్లు ఈ రాజ్యాన్ని ఆక్రమించేందుకు పోర్చుగీస్ వాళ్ళు ప్రయత్నించారు. కానీ అబ్బక్క ఆ ప్రయత్నాలన్నిటినీ తిప్పికొట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వాళ్ళను నిలవరించారు ఆమె. నిర్భయంగా ఆమె చేసిన ఈ పోరాటానికి గుర్తుగా ఆమెను అభయ రాణిగా పిలిచేవారు.[1][2] వలస పరిపాలకులపై పోరాటం చేసిన భారతీయుల్లో ఈమే మొదటివారు కావడం విశేషం. అంతేకాక అబ్బక్క మొట్టమొదటి మహిళా స్వతంత్ర పోరాట యోధురాలు కూడా.[3][4] కిత్తూరు చెన్నమ్మ, కేళడి చెన్నమ్మ, ఒనకె ఒబవ్వ, అబ్బక్క చౌతా తొలినాళ్ళ మహిళా యోధులుగా చరిత్రలో నిలిచారు.[5]
Notes
మార్చు- ↑ "Queen Abbakka's triumph over western colonisers". Press Information Bureau, Govt., of India. Retrieved 2007-07-25.
- ↑ "The Intrepid Queen-Rani Abbakka Devi of Ullal". Archived from the original on 2007-08-07. Retrieved 2007-07-25.
- ↑ "Include Tulu in Eighth Schedule: Fernandes". Rediff.com. Retrieved 2007-07-25.
- ↑ "Blend past and present to benefit future". Times of India. Retrieved 2007-07-25.
- ↑ Freedom fighters of India, Volume 4. Delhi: ISHA Books. 2008. p. 192. ISBN 81-8205-468-0.