సబిహా షేక్ (జననం 1989 నవంబరు 3), వృత్తిరీత్యా రాణి ఛటర్జీ అని పిలుస్తారు, ప్రధానంగా భోజ్‌పురి చిత్రాలలో పనిచేసే భారతీయ నటి.[1] అత్యధిక పారితోషికం పొందే ఆమె ససుర బడా పైసావాలా (2004) చిత్రంతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ఇప్పటికీ అత్యధిక వసూళ్లు చేసిన భోజ్‌పురి చిత్రంగా నిలిచింది.[2]

రాణి ఛటర్జీ
2020లో రాణి ఛటర్జీ
జననం
సబీహా షేక్

(1989-11-03) 1989 నవంబరు 3 (వయసు 35)
వృత్తి
  • నటి
  • టెలివిజన్ వ్యాఖ్యాత
  • నర్తకి
క్రియాశీల సంవత్సరాలు2003 (2003)–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
  • ససుర బడా పైసావాలా
  • దేవ్రా బడా సతవేలా

సీత (2007), దేవ్రా బడా సతవేలా (2010), గంగా యమునా సరస్వతి (2012), నాగిన్ (2013), రాణి నం. 786 (2013), దరియా దిల్ (2014), బనాల్ జ్వాలా (2015), ఘర్వాలీ బహర్‌వాలి (2016), రియల్ ఇండియన్ మదర్ (2016), రాణి వెడ్స్ రాజా (2019), లేడీ సింగం (2022) వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె ప్రముఖ నటిగా స్థిరపడింది.[3] ఆమె మస్త్రమ్ (2020)తో వెబ్‌ సీరీస్ లోకి, మస్త్ మౌలి (2023)తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె అనేక చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది.[4]

ప్రారంభ జీవితం

మార్చు

రాణి ఛటర్జీ 1989 నవంబరు 3న ఒక ముస్లిం కుటుంబంలో సబిహా షేక్‌గా జన్మించింది. ఆమె ముంబైలో పుట్టి పెరిగింది.[5][6] ఆమె తన పాఠశాల విద్యను తుంగరేశ్వర్ అకాడమీ ఉన్నత పాఠశాల, వాసాయి నుండి పూర్తి చేసింది.

అయితే, ఆమె పేరు సబిహా షేక్, రాణి ఛటర్జీగా మారడానికి కారణం ఆమె మీడియాకి వెళ్లడించింది. ఆ కథనం ప్రకారం, 2004లో ససుర బడా పైసావాలా అనే భోజ్‌పురి చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఒక ఆలయంలో ఆమె నేలపై తల కొట్టుకునే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు, చాలా మంది ప్రేక్షకులు షూటింగ్ చూస్తున్నారు, కాబట్టి ఆమె అసలు పేరును బయటపెడితే ముస్లిం అని ఎవరైనా అనుకుంటారని దర్శకుడు రాణిగా మార్చాడు.[7]

ఇది కుటుంబ సభ్యులకు మొదట తనపై కోపం తెప్పిచ్చినా, ఆమె ఆ పేరును అదృష్టంగా భావించింది. దానికి కారణం, అది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అలాగే, అనేక రికార్డులను సృష్టించింది. దాని కారణంగా భోజ్‌పురి సినిమాలో అత్యధిక పారితోషికం పొందే నటీమణుల జాబితాలో చేరింది. మనోజ్ తివారీ ఈ చిత్రంలో తన సరసన నటించాడు.[8]

కెరీర్

మార్చు

మనోజ్ తివారీ నటించిన 2003 భోజ్‌పురి ఫ్యామిలీ డ్రామా ససురా బడా పైసావాలాలో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం 2004లో విడుదలై విజయం సాధించింది. అది అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. దీంతో ఆమెకు బంధన్ తూటే నా (2005), దామద్ జీ (2006), మున్నా పాండే బెరోజ్గర్ (2007) వంటి పెద్ద హిట్‌లలో నటించే అవకాశం వచ్చింది. మున్నీబాయి నౌతంకీ వాలీ (2009)లో ఆమె టైటిల్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె తన మొదటి ఉత్తమ నటి అవార్డును దేవ్రా బడా సతవేలా (2010) కోసం గెలుచుకుంది.

2013లో ఆరవ భోజ్‌పురి అవార్డులు నాగిన్‌లో ఆమె నటనకు ఆమెని ఆ సంవత్సరపు ఉత్తమ నటిగా ప్రకటించింది.[9] ఆమె ఆస్రా అనే పంజాబీ సినిమాలో నటించింది.[10] 2020లో, ఆమె ఎమ్ఎక్స్ ప్లేయర్ వెబ్ సిరీస్ మాస్ట్రామ్‌లో నటించింది.[11] ఆ తర్వాత కూకు యాప్ వెబ్ సిరీస్ రాణి కా రాజాలో నటించింది.[12]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2004 ససుర బడా పైసావాలా రాణి [13]
2005 బంధన్ తూటే నా
2006 దామద్ జీ
2007 సీత సీత
మున్నా పాండే బెరోజ్‌గార్ సుమన్
లండన్ వాలీ సే నేహా లగావ్లీ ప్రీతి
2009 తోహర్ నైఖే కావ్నో జోడ్ తూ బేజోద్ బదు హో
2010 దేవ్రా బడా సతవేలా రాణి [14]
సాత్ సహేలియన్
2011 దిల్జాలే
చైలా బాబు
ఫూల్ బనాల్ అంగార్
2012 గంగా యమునా సరస్వతి
ధడ్కేలా తోహ్రే పేరు కరేజ్వా
సత్యమేవ జయతే
2013 నాగిన్
రాణి నం. 786 రాణి
2014 ఇన్‌స్పెక్టర్ చాందిని చాందిని
బితియా సదా సుహాఘన్ రహ్
రాణి చలి ససురల్
రౌడీ రాణి రాణి
షెర్ని
ప్రేమ్ దీవానీ
చాందిని
ఏక్ లైలా తీన్ చైలా
దరియా దిల్
భగ్జోగాని
2015 దిల్ దీవాన్ మానే నా
ఛోట్కీ దుల్హిన్
దిల్ ఔర్ దీవార్
మాయ్ కే కర్జ్
దులారా రాణి [15]
జానం
పాయల్ పాయల్
దుర్గ దుర్గ
రాణి బనల్ జ్వాలా జ్యోతి
డాన్ రాణి
2016 కర్జ్
శివ రక్షక్
వకాలాత్
ఘర్వాలీ బహర్వాలీ
మెయిన్ రాణి హిమ్మత్ వలీ రాణి
జోడి నంబర్ 1
పర్షసన్
రియల్ ఇండియన్ మదర్
దేవ్రా ఇషాక్‌బాజ్
లవ్ ఔర్ రజనీతి 2
2017 రంగబాజ్
ఇచ్చధారి
గుండెయ్
రాణి దిల్వార్ జానీ
2018 యే ఇష్క్ బడా బెదర్దీ హై
సఖి కే బియాహ్ సలోని [16]
2019 ఆస్రా చన్నీ పంజాబీ సినిమా
కసం దుర్గా కీ
రాణి వెడ్స్ రాజా రాణి ప్లేబ్యాక్ సింగర్ కూడా
2020 ఛోట్కీ ఠాకురైన్
2022 బాబుల్ కీ గలియన్
లేడీ సింగం [17]
గోవా ట్రిప్ రాణి హిందీ సినిమా
TBA ఎ బ్యాడ్ మ్యాన్ బాబు చిత్రీకరణలో ఉంది
పరివార్ కె బాబు చిత్రీకరణలో ఉంది
బాబీ మా చిత్రీకరణలో ఉంది [18]
నాచే దుల్హా గళి గళి పోస్ట్ ప్రొడక్షన్
మేర పతి మేరా దేవతా హై చిత్రీకరణ పూర్తయింది [19]

మూలాలు

మార్చు
  1. "Bhojpuri queen Rani Chatterjee chills on a beach in black swimsuit, shares throwback pic from her Maldives vacation". Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2020. Retrieved 22 August 2020.
  2. "भोजपुरी सिनेमा की सबसे ज्यादा कमाई करने वाली फिल्में". Navbharat Times (in హిందీ). 29 October 2018. Retrieved 23 March 2022.
  3. "Rani Chatterjee Filmography". Bollywood Hungama. Archived from the original on 26 February 2014. Retrieved 21 February 2014.
  4. Tiwari, Akanksha; Hindi, India TV (14 February 2023). "रानी चटर्जी ने Valentine day पर 'ठाकुर साहब' की लगा दी क्लास! कंगना के स्टाइल में निकाला गुस्सा". India TV Hindi (in హిందీ). Retrieved 16 March 2023.
  5. "'Depressed' Bhojpuri actress Rani Chatterjee threatens suicide; seeks help from Mumbai Police". Free Press Journal (in ఇంగ్లీష్). 2 July 2020. Archived from the original on 31 July 2020. Retrieved 23 August 2020.
  6. "Biography". Times of India. 6 October 2013. Archived from the original on 25 March 2018. Retrieved 21 February 2014.
  7. "मंदिर की उस घटना ने सबीहा शेख को बना दिया रानी चटर्जी, भड़क गए थे एक्ट्रेस के घरवाले". Jansatta (in హిందీ). 5 June 2020. Archived from the original on 26 October 2021. Retrieved 2 February 2021.
  8. "मंदिर की उस घटना ने सबीहा शेख को बना दिया रानी चटर्जी, भड़क गए थे एक्ट्रेस के घरवाले". Jansatta (in హిందీ). 5 June 2020. Archived from the original on 26 October 2021. Retrieved 2 February 2021.
  9. "Rani Chatterjee is actress of the year". Times of India. 29 December 2013. Archived from the original on 6 February 2014. Retrieved 21 February 2014.
  10. "Rani Chatterjee's Punjabi film Aasra to release on November 22". Zee News. 16 November 2019. Archived from the original on 18 August 2022. Retrieved 9 August 2022.
  11. "Rani Chatterjee looks drop-dead gorgeous in her latest post". The Times of India (in ఇంగ్లీష్). 5 August 2020. Archived from the original on 30 June 2022. Retrieved 9 August 2022.
  12. "मनोज तिवारी की फिल्म से किया डेब्यू, 17 साल से भोजपुरी इंडस्ट्री की स्टार हैं रानी चटर्जी". Aaj Tak (in హిందీ). 2 June 2021. Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  13. "Bhojpuri cinema edges its way to success". The Hindu (in Indian English). 28 August 2010. ISSN 0971-751X. Retrieved 23 September 2022.
  14. "Ravi Kishan and Rajkumar R Pandey together again". The Times of India. Times News Network. 17 December 2014. Retrieved 25 July 2015.
  15. "Dulara firstlook released". The Times of India. Times News Network. 8 May 2015. Retrieved 19 July 2015.
  16. "Sakhi Ke Biyah: Rani Chatterjee sizzles in new song Koyla Khani Jarat Jawani - Watch". zeenews.india.com. 24 April 2018. Retrieved 20 October 2018.
  17. "Rani Chatterjee and Shakti Kapoor starrer 'Lady Singham' trailer is out!". The Times of India. 31 March 2022. Retrieved 24 December 2022.
  18. "Rani Chatterjee unveils her amazing look from the film 'Bhabhi Maa'". The Times of India. 18 November 2021. Retrieved 20 September 2022.
  19. "Rani Chatterjee unveils the first look of 'Mera Pati Mera Devta Hai' with Prem Singh". The Times of India. 15 December 2021. Retrieved 22 November 2022.