రామరాజ్యంలో రక్తపాతం
రామరాజ్యంలో రక్తపాతం పద్మాలయా నిర్మాణ సంస్థ పతాకంపై నిర్మించగా కృష్ణ నటించిన 1975 నాటి చలనచిత్రం.
రామరాజ్యంలో రక్త పాతం (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | కృష్ణ |
కూర్పు | కోటగిరి గోపాలరావు |
నిర్మాణ సంస్థ | రామ విజేత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
విడుదల
మార్చుప్రచారం
మార్చురామరాజ్యంలో రక్తపాతం సినిమా భారతదేశం ఎమర్జెన్సీ సమయంలో విడుదలైంది. ఎమర్జెన్సీ రోజుల్లో సినిమాల్లో రక్తం, మద్యం చూపించరాదన్న నియమనిబంధనలు వచ్చాయి. దాంతో భారతదేశంలో నిర్మించి, విడుదల చేసిన సినిమాల్లో మద్యాన్ని చూపించకుండా, ఫైట్ల సమయంలో కూడా రక్తానికి తావులేని ముష్టిఘాతాలతో జాగ్రత్తపడేవారు. అటువంటి రోజుల్లో టైటిల్లోనే రక్తపాతం ఉన్న సినిమా కాబట్టి ప్రచారంలో రక్తపాతం అన్న పదాన్ని చూపించకూడదన్న నియమం విధించారు. అప్పటికే పోస్టర్లు ప్రింట్ అయిపోయివుండడంతో వాటిలో పేరులోవున్న రక్తపాతం అన్న పదంపై రక్తపాశం అన్న అక్షరాలతో ఉన్న స్లిప్పులు అతికించి ప్రచారం కొనసాగించారు.[1]